హాస్పిటల్ కు వెళ్తుండగానే చనిపోయిన భార్య.. తీవ్రంగా రోదించిన భర్త.. కంటతడి పెట్టించిన దృశ్యాలు

Published : Aug 20, 2023, 09:09 AM ISTUpdated : Aug 20, 2023, 09:15 AM IST
హాస్పిటల్ కు వెళ్తుండగానే చనిపోయిన భార్య.. తీవ్రంగా రోదించిన భర్త.. కంటతడి పెట్టించిన దృశ్యాలు

సారాంశం

హాస్పిటల్ కు తీసుకెళ్తుండగానే భార్య పరిస్థితి విషమించడంతో చనిపోయింది. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో జరిగింది. దీంతో ఆ భర్త తట్టుకోలేకపోయాడు. తీవ్రంగా రోదించాడు. అతడి వద్ద డబ్బులు లేకపోవడంతో ప్రజలు చందాలు వేసి, ఓ వాహనంలో డెడ్ బాడీని స్వగ్రామానికి పంపించారు.

వారిద్దరూ భార్యాభర్తలు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఉన్నంతలో సంతోషంగా బతుకుతున్నారు. ఈ క్రమంలో భార్య అనారోగ్యానికి గురైంది. దీంతో భర్త ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లాలని భావించాడు. స్వగ్రామం నుంచి ఆటోలో బయలుదేరాడు. అక్కడి నుంచి బస్సులో మరో ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. అయితే అక్కడే భార్య పరిస్థితి విషమించి చనిపోయింది. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.

చంద్రయాన్ -3 : చందమామకు మరింత దగ్గరైన విక్రమ్.. రెండో ‘డీబూస్టింగ్’ ప్రక్రియ విజయవంతం..

వివరాలు ఇలా ఉన్నాయి. అమడగూరు మండలంలోని మామిడిమేకలపల్లి గ్రామంలో ఈశ్వరప్ప- చౌడమ్మ (35) దంపతులు నివసిస్తున్నారు. ఈ క్రమంలో చౌడమ్మ అనారోగ్యానికి గురైంది. దీంతో ఈశ్వరప్ప ఆమెను హాస్పిటల్ లో చూపించేందుకు అనంతపురం తీసుకెళ్లాలని భావించాడు. అందుకే శనివారం అతడు తన భార్యను తీసుకొని గ్రామం నుంచి ఆటోలో బయలుదేరాడు. 

చావులోనూ వీడని బంధం.. భార్య మృతదేహం వద్దే చివరి శ్వాస విడిచిన వృద్ధుడు

ఆ ఆటో కొంత సమయం తరువాత ఓబుళదేవరచెరువుకు చేరుకుంది. అక్కడి నుంచి బస్సులో ఈ దంపతులు ఇద్దరూ అనంతపురం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఓబుళదేవరచెరువు బస్టాండ్ కు ఈ భార్యాభర్తలు చేరుకున్నారు. అక్కడికి వచ్చిన తరువాత చౌడమ్మ పరిస్థితి విషమించింది. బస్సు కోసం ఎదురుచూస్తున్న సమయంలోనే ఆమె మరణించింది. 
విషాదం.. పొలంలో పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న రైతుపై ఏనుగు దాడి.. కాలితో తొక్కడంతో మృతి

దీంతో భర్త ఒక్క సారిగా షాక్ అయ్యాడు. తన భార్య మృతదేహాన్ని హత్తుకొని తీవ్రంగా రోదించాడు. ఆయన విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. చౌడమ్మ మృతదేహన్ని గ్రామానికి తీసుకెళ్లేందుకు ఈశ్వరప్ప దగ్గర డబ్బులు కూడా లేవు. దీనిని గమనించిన అక్కడి ప్రజలు తలా కొంత తీశారు. చందావేసి డబ్బులు జమ చేశారు. వాటితో ఓ ప్రైవేటు వాహనాన్ని సమకూర్చారు. అందులో డెడ్ బాడీని స్వగ్రామానికి పంపించి మానవత్వం ప్రదర్శించారు.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే