రాజధాని గ్రామాల్లో పర్యటనకు పవన్ సిద్దం: జనసేన ఆఫీస్ వద్ద టెన్షన్

By narsimha lodeFirst Published Jan 20, 2020, 5:56 PM IST
Highlights

రాజధాని పరిసర గ్రామాల్లో పర్యటించేందుకు జనసేన చీప్ పవన్ కళ్యాణ్ సోమవారం నాడు ప్రయత్నాలు ప్రారంభించారు. 


అమరావతి: జనసేన ప్రధాన కార్యాలయం వద్ద  సోమవారం నాడు సాయంత్రం టెన్షన్ వాతావరణం నెలకొంది. జనసేన కార్యాలయాన్ని పోలీసులు చుట్టుముట్టారు. 

రాజధాని గ్రామాల్లో పర్యటించాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకొన్నారు. పవన్ కళ్యాణ్  రాజధాని గ్రామాల్లో పర్యటించకుండా నిలువరించేందుకు గాను పోలీసలుు జనసేన ప్రధాన కార్యాలయం చుట్టూ మోహరించారు.  

Also read:పవన్ కళ్యాణ్‌పై తిరుగుబాటు: అసెంబ్లీలో మూడు రాజదానులకు జై కొట్టిన రాపాక

Also read:ఆ రెండు బిల్లులకు వ్యతిరేకించాలి: రాపాక వరప్రసాద్‌కు పవన్ లేఖ

Also read:పవన్‌కు షాక్: జగన్‌కు జై కొట్టిన జనసేన ఎమ్మెల్యే రాపాక

జనసేన ప్రధాన కార్యాలయం చుట్టూ పోలీసులు మోహరించిన విషయం తెలుసుకొన్న జనసేన కార్యకర్తలు కూడ భారీగా పార్టీ కార్యాలయం వద్దకు చేరుకొన్నారు.  ఏపీ రాష్ట్ర ప్రభుత్వం  సోమవారం నాడు   సీఆర్‌డీఏ రద్దు బిల్లు, పాలనా వికేంద్రీకరణ బిల్లులను ప్రవేశపెట్టింది. ఈ బిల్లులను జనసేన వ్యతిరేకిస్తోంది. కానీ, జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం ఈ బిల్లులకు అనుకూలంగా అసెంబ్లీలో మాట్లాడారు.

రాజధానికి చెందిన మందడం, ఎర్రబాలెం, పెనుమాక గ్రామాల్లో  పర్యటించాలని  పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.సోమవారం నాడు సాయంత్రం జనసేన  పీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశం జరుగుతున్న సమయంలోనే జనసేన కార్యాలయంలోకి పోలీసులు ప్రవేశించారు. పోలీసులు పార్టీ కార్యాలయంలోకి  రావడంపై   తీవ్ర అభ్యంతరం వ్యక్ం చేశారు.
 

click me!