
హైదరాబాద్: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి భారీ భద్రతను ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్. విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో జగన్ కు భద్రత కల్పించినట్లు తెలుస్తోంది. విశాఖ ఎయిర్ పోర్ట్ లో దాడి అనంతరం అక్కడే ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్న జగన్ నేరుగా హైదరాబాద్‌కు చేరుకున్నారు.
హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందారు. గాయం మానడానికి కొద్దిరోజులు సమయం పడుతుందన్న వైద్యుల సూచన మేరకు జగన్ పాదయాత్ర వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం జగన్ హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ లో తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో జగన్‌కు తెలంగాణ ప్రభుత్వం భారీ భద్రత కల్పించింది. బుల్లెట్ ప్రూప్ వెహికల్‌ను ప్రభుత్వం కేటాయించింది. అలాగే జగన్ ఇంటి వద్ద కూడా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసు శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
రాష్ట్రపతి పాలనకు కేంద్రం కుట్ర: చంద్రబాబు అనుమానం
జగన్‌పై దాడి.. డీజీపీ నివేదికపై చంద్రబాబు అసంతృప్తి
జగన్ గాయంపై వివరాలు చెప్పిన వైద్యుడు (వీడియో)
ఎపి పోలీసులపై నాకు నమ్మకం: వైఎస్ జగన్