వారి ఆటలు నాదగ్గర సాగవు...జగన్, పవన్‌లకు చంద్రబాబు వార్నింగ్

By Arun Kumar PFirst Published Nov 5, 2018, 6:36 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని బాగుచేయాలని తాను ప్రయత్నిస్తుంటే వైసిపి నేతలు భ్రష్టు పట్టించాలని చూస్తున్నారని ఏపి సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అందుకోసమే ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేయాలని అనుకుంటున్నారని....అయితే వారి ఆటలు తన వద్ద సాగవని చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 
 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని బాగుచేయాలని తాను ప్రయత్నిస్తుంటే వైసిపి నేతలు భ్రష్టు పట్టించాలని చూస్తున్నారని ఏపి సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అందుకోసమే ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేయాలని అనుకుంటున్నారని....అయితే వారి ఆటలు తన వద్ద సాగవని చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 

శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు తిత్లీ తుఫాను బాధితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వైసిపి నాయకుడు జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై ఫైర్ అయ్యారు. తితిలీ తుఫాను సంబవించిన సమయంలో చంద్రబాబు పక్క జిల్లాలోనే ఉన్నారని గుర్తుచేశారు. కానీ శ్రీకాకుళం ప్రజలు తుఫాను దాటికి విలవిల్లాడుతున్నా కనీసం  వారిని పరామర్శించిన పాపాన పోలేదని ఆరోపించారు. కానీ ఇప్పుడు ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని...వైసిపి నీచ రాజకీయాలకు తాను భయపడే రకం కాదని చంద్రబాబు హెచ్చరించారు. 

ఇక ఉద్దానం బాధితులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు నటించే పవన్ కళ్యాణ్ తిత్లీ బాధితుల గురించి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఆయన ఈ దీనిపై కేంద్రానికి ఒక్క లేఖ కూడా ఎందుకు రాయలేదని అడిగారు. 

కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వున్న పార్టీలను ఏకం చేయడానికి తాను ప్రయత్నిస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. బిజెపి అరాచక పాలనను  అంతమొందించడానికే కాంగ్రెస్ సహకారం కోరిసట్లు తెలిపారు. ఈ పోరాటం ఇంతటితో ఆగదని చంద్రబాబు స్పష్టం చేశారు. 

శ్రీకాకుళం పర్యటనలో భాగంగా పలాసలో  కిడ్నీ పరిశోధనా సంస్థకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.  అలాగే తిత్లీ తుఫాను వల్ల నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం  తరపున చంద్రబాబు చెక్కులు అందించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

పవన్ కళ్యాణ్ ఓ అవివేకి:డొక్కా ఫైర్

పవన్ వల్లే టీడీపీ గెలవలేదు, స్థానిక సంస్థల్లో ఒంటరిగా గెలిచాం:చినరాజప్ప

పవన్ కళ్యాణ్ ఓ అవివేకి:డొక్కా ఫైర్

మోదీ ప్రధాని కాదు దెయ్యం అంటున్న డొక్కా

click me!