తూ.గో విషాదం: ఇద్దరమ్మాయిల కోసం... సముద్రంలో దిగి కొట్టుకుపోయిన యువకుడు

By Arun Kumar PFirst Published Oct 22, 2021, 10:05 AM IST
Highlights

ఇద్దరు అమ్మాయిలు సముద్రంలో మునిగిపోతుంటే కాపాడబోయి యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.

కాకినాడ: సముద్రపు ఒడ్డున సరదాగా గడపడానికి వెళ్లిన అమ్మాయిలు ప్రమాదంలో చిక్కుకోగా వారిని కాపాడేక్రమంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. సముద్రపు నీటిలో చిక్కుకున్న అమ్మాయిలను కాపాడబోయి యువకుడే గల్లంతయ్యాడు. అమ్మాయిలు మాత్రం క్షేమంగా ఒడ్డుకు చేరారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే... east godavari district ముమ్మిడివరం సమీపంలోని కాట్రేనికోన మండలం  గచ్చకాయల పొరకు చెందిన నలుగురు అక్కాచెల్లెల్లు సరదాగా గడిపేందుకు సముద్రపు ఒడ్డు(beach) కు వెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరు యువతులు సముద్రపు అలలతో ఆడుకుంటూ మెళ్లిమెళ్లిలో సముద్రం లోపటికి వెళ్లారు. దీంతో వారు సముద్ర అలల మద్య చిక్కుకుని బాగా లోతులోకి వెళ్ళడంతో నీటిలో మునిగిపోసాగారు. 

యువతులు మునిగిపోతున్న విషయాన్ని గమనించిన మల్లాడి బాలయేసు(18) వారిని కాపాడేందుకు సముద్రంలో దిగాడు. అయితే అలల తాకిడికి అతడు కూడా నీటమునిగి గళ్లంతయ్యాడు. ఇదే సమయంలో కొందరు మత్స్యకారులు అటువైపుగా వచ్చి సముద్రంలో చిక్కుకున్న వారిని గుర్తించారు. వెంటనే సముద్రంలో దిగిన వారు అక్కాచెల్లెలిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. 

వీడియో

యువతులను కాపాడేందుకు ప్రయత్నించి గల్లంతయిన బాలయేసు కోసం మత్స్యకారులు ఎంత ప్రయత్నించినా దొరకలేదు. అతడి కోసం సముద్రంలో గాలింపు కొనసాగుతోంది. ఇలా అమ్మాయిలను కాపాడబోయి యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అమ్మాయిల నుండి ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు. గజ ఈతగాళ్ళ సాయంతో బాలయేసు కోసం సముద్రంలో గాలింపు చేయిస్తున్నారు. కొడుకును కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 
 
 

click me!