రెండు రోజులుగా అదృశ్యం: మాల్దీవుల్లో టీడీపీ నేత పట్టాభి?

By narsimha lode  |  First Published Oct 25, 2021, 5:36 PM IST


టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి మాల్దీవుల్లో ఉన్నారని ప్రచారం సాగుతుంది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలైన తర్వాత ఆయన కన్పించకుండా పోయిన విషయం తెలిసిందే. అయితే మాలే ఎయిర్ పోర్టులో ఆయన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.


విజయవాడ: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి  మాల్దీవుల్లో ఉన్నారనే ప్రచారం సాగుతోంది.ఈ విషయమై పట్టాభికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రెండు రోజుల క్రితం పట్టాభి రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలైన  తర్వాత అదృశ్యమయ్యారు. అయితే ఆయన ఆచూకీ ఇప్పటివరకు లభ్యం కాలేదు. అయితే ఆకస్మాత్తుగా మాలే ఎయిర్‌పోర్టులో పట్టాభి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.అయితే ఈ ఫోటోలు తాజాగా తీసిన ఫోటోలేనా లేదా పాత ఫోటోలను షోషల్ మీడియాలో పోస్టు చేశారా అనే విషయమై నిర్ధారణ కావాల్సి ఉంది.

also read:టీడీపీ కార్యాలయాలపై దాడులు: మరో అరుగురి అరెస్ట్.. మిగిలిన వారి కోసం తీవ్ర గాలింపు

Latest Videos

undefined

ఏపీ సీఎం Ys Jagan పై బూతు వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధికార ప్రతినిధి Pattabhiని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను కోర్టులో హాజరుపరిస్తే నవంబర్ 2వ తేదీ వరకు మేజిస్ట్రేట్ జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. ఇందులో భాంగానే ఆయన Rajahmundry సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే తనకు Bail  మంజూరు చేయాలని పట్టాభి కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆయనకు బెయిల్ ను మంజూరు చేసింది. 

రాజమండ్రి సెంట్రల్ నుండి బయటకు వచ్చిన పట్టాభి  నేరుగా విజయవాడకు రాకుండానే అదృశ్యమయ్యాడు. ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారనే ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారాన్ని విజయవాడ పోలీసులు తోసిపుచ్చారు. పట్టాభిని అరెస్ట్ చేయలేదని తేల్చి చెప్పారు. దీంతో పట్టాభి ఎక్కడ ఉన్నాడనే విషయమై  సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో పట్టాభి మాల్దీవులకు వెళ్లినట్టుగా ప్రచారం సాగుతోంది.పట్టాభి మాల్దీవులకు వెళ్లారా లేదా అనే విషయమై పార్టీ నేతలు కానీ ఆయన కుటుంబ సభ్యుల నుండి కానీ స్పష్టత రావాల్సి ఉంది.

ఏపీ సీఎం జగన్ పై పట్టాభి చేసిన వ్యాఖ్యల తర్వాత ఏపీలో టీడీపీ కార్యాలయాలపై దాడులు చోటు చేసుకొన్నాయి. పట్టాభి ఇంటిపై కూడా వైసీపీ శ్రేణులు దాడులు చేశాయి. ఈ దాడులను నిరసిస్తూ టీడీపీ కార్యాలయంలోనే చంద్రబాబు 36 గంటల దీక్షకు దిగాడు. మరోవైపు చంద్రబాబు, పట్టాభి క్షమాపణలు చెప్పాలంటూ వైసీపీ నేతలు జనాగ్రహ దీక్షలు నిర్వహించారు.తమ కార్యాలయాల్లో దాడులపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కు చంద్రబాబునాయుడు ఇవాళ ఫిర్యాదు చేశారు. మరో వైపు టీడీపీ గుర్తింపును రద్దు చేయాలని ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేయనుంది.

click me!