టీడీపీకి దెబ్బ: కాకినాడ మేయర్ గా సుంకర శివప్రసన్న, వైసీపీదే పైచేయి

By narsimha lodeFirst Published Oct 25, 2021, 3:22 PM IST
Highlights

కాకినాడ మేయర్ గా సుంకర శివ ప్రసన్న సోమవారం నాడు ఎన్నికైంది. డిప్యూటీ మేయర్ గా మీసాల ఉదయ్ కుమార్ ఎన్నికయ్యారు. కాకినాడ మేయర్ గా ఉన్న సుంకర  పావనిపై అవిశ్వాసం నెగ్గడంతో కొత్త మేయర్ ఎన్నిక కోసం ఇవాళ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.

కాకినాడ:  Kakinada Mayor  గా  సుంకర శివ ప్రసన్న, డిప్యూటీ మేయర్ గా  మీసాల ఉదయ్ కుమార్ ఎన్నికయ్యారు. కాకినాడ డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం సోమవారం నాడు ప్రత్యేకంగా కాకినాడ కార్పోరేషన్  సమావేశాన్ని నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి ఉన్న ఏకైక కార్పోరేషన్ వైసీపీ పరమైంది. 

also read:కాకినాడ మేయర్ సుంకర పావని తొలగింపు.. యాక్టింగ్ మేయర్ గా అతనే..

మేయర్ గా ఎన్నికైన Sunkara Shiva prasanna గతంలో టీడీపీ నుండి కార్పోరేటర్ గా విజయం సాధించారు. ఆ తర్వాత ఆమె వైసీపీలో చేరారు. కాకినాడలోని 40వ డివిజన్ నుండి ఆమె కార్పోరేటర్ గా విజయం సాధించారు.ఇప్పటివరకు మేయర్ గా ఉన్న సుంకర పావనిపై అవిశ్వాసం ప్రవేశపెట్టారు.ఈ No confidence motion పావని ఓటమి పాలైంది. దీంతో కొత్త మేయర్ ఎంపిక కోసం ఇవాళ ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఇవాళ నిర్వహించిన సమావేశానికి Tdp కార్పోరేటర్లు గైర్హాజరయ్యారు. హజరైన  కార్పోరేటర్లు   మేయర్ గా సుంకర శివ ప్రసన్న, డిప్యూటీ మేయర్ గా  మీసాల ఉదయ్ కుమార్ ఎన్నుకొన్నారు.

ఈ  నెల 5వ తేదీన  కాకినాడ మేయర్ పావని పై టీడీపీలోని అసమ్మతి వర్గానికి చెందిన టీడీపీ కార్పోరేటర్లుప్రతిపాదించిన అవిశ్వాసం నెగ్గింది, అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 36 మంది ఓటు చేశారు.2017లో కాకినాడ కార్పోరేషన్ కు ఎన్నికలు జరిగాయి. 48 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. కార్పోరేటర్లలో ఒకరు రాజీనామా చేశారు. ముగ్గురు మరణించారు. దీంతో ప్రస్తుతం  44 మంది కార్పోరేటర్లున్నారు. కాకినాడ కార్పోరేషన్ లో టీడీపీకి 30 మంది కార్పోరేటర్లున్నారు.Ycpకి 8 మంది సభ్యులున్నారు. Bjpకి ముగ్గురు కార్పోరేటర్లున్నారు. ముగ్గురు ఇండిపెండెంట్ సభ్యులున్నారు. అయితే ఇండిపెండెంట్ సభ్యుల్లో ఒకరు గతంలోనే టీడీపీకి మద్దతిచ్చారు.

click me!