కొటియా గ్రామాల్లో ఉద్రిక్తత: ఏపీ అధికారులను అడ్డుకొన్న ఒడిశా పోలీసులు

By narsimha lodeFirst Published Oct 25, 2021, 3:59 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లోని కొటియా గ్రామాల సరిహద్దుల్లో సోమవారం నాడు ఉద్రిక్తత నెలకొంది.తెలుగు బోర్డులు ఏర్పాటు చేయకుండా ఒడిశా అధికారులు అడ్డుకొన్నారు.

విజయనగరం:  ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల్లోని కొటియా గ్రామాల్లో సోమవారం నాడు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తెలుగు బోర్డులు ఏర్పాటు చేయకుండా Odisha అధికారులు అడ్డుకొన్నారు. తెలుగు బోర్డులను ఏర్పాటు చేయడాన్ని ఒడిశా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.అయితే ఒడిశా అధికారుల తీరును kotia గ్రామాలకు చెందిన గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకించారు.తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే  కొనసాగుతామని కొటియా గ్రామాలకు చెందిన గిరిజనులు చెబుతున్నారు.కొటియా గ్రామాలైన పగులు చెన్నేరు,. పట్టు చెన్నేరు. డిలియాంబ గ్రామాలకు చెందిన గిరిజనులు ఒడిశాకు చెందిన అధికారులను అడ్డుకొన్నారు. ఒడిశాకు చెందిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తెలుగు బోర్డులు ఏర్పాటు చేసేందుకు సహకరించాలని ఒడిశా పోలీసులతో ఆదీవాసీలు వాగ్వాదానికి దిగారు.
ఈ గ్రామాల మధ్య వివాదం విషయమై సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున సంయమనం పాటించాలని ఏపీ ప్రభుత్వం తమ అధికారులకు సూచించింది. దీంతో విజయనగరం ఐటీడీఏ అధికారులు బోర్డుల ఏర్పాటు విషయంలో వెనక్కు తగ్గారు.

also read:గతంలో కూడా ఈ మూడు గ్రామాల్లో ఎన్నికలు: సుప్రీంలో ఏపీ వాదన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ఒడిశాలోని కోరాపుట్ జిల్లాల మధ్య ఉండే షెడ్యూల్ ప్రాంతంలోని 21 గ్రామాల్ని కొటియా గ్రామాలుగా పిలుస్తారు.ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల్లో 34 గ్రామాల్లో సుమారు 4 వేల మంది గిరిజనులు నివాసం ఉంటున్నారు.ఈ గిరిజనులకు Andhra pradesh, Odisha రాష్ట్రాల ఓటు హక్కుంది. ఇక్కడ దాదాపుగా 15 వేల మంది నివసిస్తున్నారు.వీరిలో 3,902 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు.ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అవతరించినప్పుడు కొటియా గ్రామాల్లో సర్వే జరగలేదు. వీటిని ఏ రాష్ట్రంలోనూ కలపలేదు. ఈ గ్రామాలు తమ పరిధిలోనివేనంటూ ఇరు రాష్ట్రాలూ వాదిస్తున్నాయి. 1968లో సుప్రీంకోర్టునూ ఆశ్రయించాయి.

అప్పటి నుంచి ముందుకు కదలని కొటియా కేసుపై 2000లో Supreme court ఓ ప్రతిపాదన చేసింది. దాని ప్రకారం కొటియా సమస్యను పరిష్కరించేందుకు ఇరు రాష్ట్రాల సమ్మతితో జైపూర్ జిల్లా జడ్జి అధ్యక్షతన ఆరుగురు సభ్యుల కమిటీని వేసింది. అందులో ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు, న్యాయవాదులు ఉన్నారు.కొటియా విషయంలో ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటనలు, కోర్టులో వాదనలు చేసింది. అయినా విషయం కొలిక్కి రాలేదు. తర్వాత 2006లో ఈ సమస్యని పార్లమెంటులో తేల్చుకోవాలని సుప్రీం కోర్టు సూచించింది.

click me!