అసెంబ్లీ సమావేశాల్లో వ్యూహాత్మకంగా టీడీపీ అడుగులు వేయనుంది. అమరావతి విషయమై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు టీడీపీ సిద్దమైంది.
అమరావతి: వైసీపీకి జై కొట్టిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు కూడ ఆ పార్టీ శాసనససభా పక్షం విప్ జారీ చేసింది. టీడీపీ నుండి సస్పెన్షన్‌కు గురైన వల్లభనేని వంశీమోహన్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి కూడ టీడీపీ విప్ జారీ చేసింది. పార్టీ ఆదేశాల ప్రకారంగా నడుచుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
Also read:రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు: నేడు భేటీ కానున్న టీడీఎల్పీ
undefined
గత ఏడాది చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ జగన్‌కు జై కొట్టారు. వైసీపీలో చేరుతానని ప్రకటించారు. చంద్రబాబునాయుడుతో పాటు లోకేష్‌పై వంశీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో వల్లభనేని వంశీపై టీడీపీ నాయకత్వం ఆయనను సస్పెండ్ చేసింది.
దీంతో వంశీ అసెంబ్లీలో తనకు ప్రత్యేక సీటును కేటాయించాలని కోరారు. వంశీ కోరిక మేరకు స్పీకర్ తమ్మినేని సీతారాం మన్నించారు. వంశీకి ప్రత్యేక స్థానాన్ని కేటాయించారు.
Also read:ఏపీ హైకోర్టు ఆఫర్: సీఆర్‌డీఏకు ఈ నెల 20వ తేదీ వరకు రైతులకు గడువు
మరో వైపు ఈ నెల మొదటి వారంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి జగన్ ను కలిశారు. వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు. మద్దాలి గిరిపై చంద్రబాబునాయుడు చర్యలు తీసుకోలేదు. వ్యూహత్మకంగానే పార్టీ నాయకత్వం గిరిపై సస్పెన్షన్ వేటు వేయలేదని చెబుతున్నారు.
ఈ నెల 20వ తేదీ నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో అమరావతి అంశంపై స్పష్టత రానుంది. ఈ తరుణంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై టీడీఎల్పీ సమావేశం ఆదివారంనాడు ఉదయం జరిగింది.
అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలు హాజరుకావాలని టీడీపీ తమ పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరికి కూడ టీడీపీ శాసనసభపక్షం ఆదివారం నాడు పోస్టులో పిప్ పంపింది.
పార్టీ ఆదేశం ప్రకారంగా అసెంబ్లీలో నడుచుకోవాలని విప్ జారీ చేసింది. విప్‌ను ధిక్కరిస్తే చర్యలు తీసుకొనేందుకు టీడీపీ నాయకత్వం రంగం సిద్దం చేస్తోంది. అయితే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడ వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే పార్టీ విప్‌ను ధిక్కరిస్తారా, పాటిస్తారా అనేది అసెంబ్లీ సమావేశాల్లో తేలనుంది.