అమరావతి : ఏపీలో నాలుగు జోనల్ కమిషనరేట్లు?

By narsimha lodeFirst Published Jan 19, 2020, 9:30 AM IST
Highlights

ఏపీలో నాలుగు జోనల్ కమిషనరేట్లను ఏర్పాటు చేయాలని సర్కార్ భావిస్తందని సమాచారం. ఈ విషయమై ఈ నెల 20వ తేదీన స్పష్టత రానుంది.


అమరావతి: అమరావతి భవితవ్యం ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తేలే అవకాశం ఉంది. హై పవర్ కమిటీ నివేదికను అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టనుంది ప్రభుత్వం. 
 ఉత్తరప్రదేశ్‌లోని డివిజన్ల తరహాలో నవ్యాంధ్రను కూడా నాలుగు జోన్లుగా విభజించాలని భావిస్తున్నట్టుగా కసరత్తు సాగుతోందని ప్రచారం సాగుతోంది. కానీ, ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

also read:సచివాలయం శాశ్వతమని బాబు నిరూపిస్తే తలదించుకొని వెళ్తా: బొత్స సవాల్

 నాలుగు జోనల్‌ కమిషనరేట్లను ఏర్పాటు చేసి ప్రతి జోన్‌లో ప్రతి కీలక శాఖకు చెందిన జోనల్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

Also read:మహిళలను మగపోలీసులు కొట్టారా?: ఏజీపై ఏపీ హైకోర్టు ప్రశ్నల వర్షం

సచివాలయంతో సంబంధమున్న విధానపరమైన నిర్ణయాలు కాకుండా ప్రజా వినతులు, సమస్యలు, ఉద్యోగుల కోర్కెలు తదితరాలన్నీ కమిషనరేట్లలోనే పరిష్కారంకానున్నాయి. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో 75 జిల్లాలు ఉన్నాయి. పాలనాసౌలభ్యం కోసం వీటన్నిటినీ 18 డివిజన్లుగా విభజించి డివిజనల్‌ కమిషనరేట్లను ఏర్పాటు చేశారు.

also read:అమరావతి: విశాఖకు రాజధాని తరలించొద్దంటూ సీఆర్‌డీఏకు రైతుల అభ్యంతరాలు

Also Read:జగన్ వెన్నుపోటు పొడిచాడు:అమరావతి రైతుల దీక్షలో వంగవీటి రాధా

 
ఇదే మోడల్‌పై సీఎం జగన్‌ దృష్టి సారించారు. జోనల్‌ వ్యవస్థపై సోమవారం ఉదయం జరిగే మంత్రివర్గ భేటీలో, అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం తన కార్యాచరణను వెల్లడించే అవకాశం లేకపోలేదు. 

నాలుగు జోనల్‌ కమిషనరేట్లను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ సమస్యలను పరిష్కరిస్తే రాజధానిపై వారిలో సెంటిమెంటు ఉండదని భావిస్తున్నట్లు విశ్లేషిస్తున్నాయి. ఈ మేరకు సోమవారం ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెడతారని సమాచారం. దీనిప్రకారం.. ఉత్తర కోస్తా, మధ్య కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జోన్లు ఏర్పాటవుతాయని తెలిసింది.

ఆర్‌డీఏ చట్టాన్ని రద్దు చేస్తూ బిల్లును తీసుకురాబోతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.సీఆర్‌డీఏ చట్టంలో మార్పులూ చేర్పులూ చేసేందుకు సోమవారం నాడు జరిగే కేబినెట్ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

విజయవాడ-గుంటూరు-మంగళగిరి-తెనాలి పట్టణాభివృద్ధి సంస్థకు అధికారాలు బదలాయిస్తూ బిల్లు తీసుకు వచ్చే యోచనలో సర్కార్ ఉంది. చట్టసభలు, పరిపాలన, న్యాయ రాజధానుల విభజనతో పాటు జోనల్‌ కమిషనరేట్ల ఏర్పాటు ద్వారా రాజధాని ఒకే చోట కేంద్రీకృతమై ఉందన్న అభిప్రాయాన్ని లేకుండా చేయాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది.


 

click me!