పొలవరం ప్రాజెక్టు విషయంలో హైకోర్టు నిర్ణయంపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు స్పందించారు. జగన్ మూర్ఖంగా నిర్ణయాలు తీసుకొంటున్నారని ఆయన విమర్శించారు.
అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై ప్రయోగాలు చేయకూడదని తాను మొదటి నుండి చెబుతూనే ఉన్నానని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో చంద్రబాబునాయుడు స్పందించారు.
పోలవరం ప్రాజెక్టు జలవిద్యుత్ ప్రాజెక్టు పనులకు రివర్స్ టెండరింగ్ కు వెళ్లకూడదని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విషయమై చంద్రబాబునాయుడు స్పందించారు. గురువారం నాడు చంద్రబాబునాయుడు అమరావతిలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు.
పోలవరం ప్రాజెక్టులో లేని అవినీతిని నిరూపించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చంద్రబాబునాయుడు అన్నారు. ఒక్క సారి న్యాయవివాదం మొదలైతే ప్రాజెక్టుపై ప్రభావం పడుతోందన్నారు. జగన్ మూర్ఖంగా నిర్ణయాలు తీసుకొంటున్నారని చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
రివర్స్ టెండర్ల వ్రాజెక్టుకు నష్టమని ఆయన తేల్చి చెప్పారు. టెండర్లు రద్దు వద్దని గతంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారని ఆయన గుర్తు చేసుకొన్నారు.ప్రభుత్వానికి పిచ్చిపట్టిందని అనుకోవాలా... లేక రాష్ట్రానికి వని పట్టిందని అనుకోవాలా అని చంద్రబాబు ప్రశ్నించారు.
పోలవరం ప్రాజెక్టు జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో రివర్స్ టెండరింగ్ వద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ విషయంలో మాత్రం రివర్స్ టెండరింగ్ తో ముందుకు వెళ్లవచ్చని కూడ కోర్టు తెలిపింది.నవయుగ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఈ వక్యాలు చేసింది.
సంబంధిత వార్తలు
జగన్‌కు హైకోర్టు షాక్: రివర్స్ టెండరింగ్ పై మధ్యంతర ఉత్తర్వులు
తగ్గని జగన్: పోలవరం అథారిటీకి కౌంటర్
పోలవరంపై నవయుగ పిటిషన్: వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్
పోలవరం: జగన్ సర్కార్ నిర్ణయంపై కోర్టుకెక్కిన నవయుగ
జగన్‌కు షాక్: రివర్స్ టెండరింగ్‌పై పీపీఏను నివేదిక కోరిన కేంద్రం
సీఈఓ లేఖ బేఖాతరు: పోలవరం పనులకు రివర్స్ టెండర్ల ఆహ్వానం
రివర్స్ టెండరింగ్ పై సీఈఓ లేఖ: జగన్ నిర్ణయంపై ఉత్కంఠ
నష్టమే: రివర్స్ టెండరింగ్‌పై జగన్ సర్కార్ కు జైన్ లేఖ
సీఈవో హెచ్చరికలు బేఖతారు: పోలవరంపై మడిమ తిప్పని జగన్
రీటెండరింగ్ వద్దు, నవయుగే ముద్దు: సీఎం జగన్ కు సీపీఐ రామకృష్ణ లేఖ
జైన్ షాక్: జగన్ రివర్స్ టెండరింగ్ తడిసి మోపెడు