విదేశీ బ్యాంకుల షాక్: పిపిఎల రద్దుపై వెనక్కి తగ్గిన జగన్ సర్కార్

By narsimha lodeFirst Published Aug 22, 2019, 12:42 PM IST
Highlights

పీపీఏల విషయంలో జగన్ సర్కార్ వెనక్కు తగ్గింది. చంద్రబాబునాయుడు సర్కార్ పీపీఏలతో ప్రజాధనాన్నిదుర్వినియోగం చేసిందని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

హైదరాబాద్: పీపీఏల రద్దు విషయంలో ఏపీ సర్కార్  వెనక్కి తగ్గింది. అవకతవకలు జరిగినట్టుగా ధృవీకరించిన ఒప్పందాలనే పున:సమీక్షించాలని కేంద్రప్రభుత్వానికి ఏపీ సర్కార్ తెలిపింది. చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఎక్కువ ధరకు ప్రైవేట్ విద్యుత్ సంస్థల నుండి ఎక్కువ ధరకు విద్యుత్ ను కొనుగోలు చేసిందని జగన్ సర్కార్ ఆరోపణలు చేసింది.

చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీల నుండి ఎక్కువ ధరకు విద్యుత్ ను కొనుగోలు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆరోపణలు చేశారు. పీపీఏలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు. జగన్ సర్కార్ తీసుకొన్న నిర్ణయాన్ని నిర్ణసిస్తూ కొన్ని కంపెనీలు హైకోర్టును కూడ ఆశ్రయించాయి.

పీపీఏల రద్దును కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి కూడ వ్యతిరేకించారు. జపాన్ సర్కార్ కూడ ఈ విషయమై తీవ్రంగా తప్పుబట్టింది. పీపీఏల రద్దు విషయాన్ని పునరాలోచించుకోవాలని పలు సంస్థలు కోరాయి.

అయితే ఈ విషయంలో జగన్ సర్కార్ వెనక్కు తగ్గలేదు. పీపీఏల రద్దు విషయంలో కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి లేఖను కూడ జగన్ ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లినట్టుగా వైఎస్ఆర్‌సీపీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

పీపీఏల రద్దు విషయంలో విమర్శలు రావడంతో జగన్ సర్కార్ కొంత వెనక్కు తగ్గింది. అవకతవకలు జరిగినట్టుగా ధృవీకరించిన ఒప్పందాలనే పున:సమీక్షించాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా జగన్ ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్ కె సింగ్  మీడియాకు వివరించారు.

పీపీఏల రద్దు, పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ విషయంలో  ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను సంప్రదించిన తర్వాతే జగన్ నిర్ణయం తీసుకొన్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బుధవారం నాడే ప్రకటించారు.ఈ ప్రకటన చేసిన రోజునే కేంద్ర మంత్రి సింగ్ చేసిన ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకొంది.

ఏపీ రాష్ట్రంలో 7700 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసే సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. 2022 నాటికి 80 బిలియన్ డాలర్ల మేరకు ఈ రంగాల్లో పెట్టుబడులు సేకరించాలని కేంద్రం భావిస్తోంది. అయితే ఏపీ సర్కార్ తీసుకొన్న నిర్ణయాల కారణంగా తమ లక్ష్యం దెబ్బతినే అవకాశం ఉందని  కేంద్ర ఇంధన శాఖాధికారులు చెబుతున్నారు.

దేశంలో విదేశీ పెట్టుబడులు తగ్గిపోతున్నాయి.ఈ తరుణంలో  జగన్ సర్కార్ తీసుకొన్న నిర్ణయం  మరింత ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయమై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్ కె సింగ్  రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. పీఎంఓ కూడ రంగంలోకి దిగింది.

సరైన ఆధారాలు లేకుండానే పీపీఏలను రద్దు చేయడం సహేతుకం కాదని కేంద్రం రాష్ట్రానికి తేల్చి చెప్పింది.పారదర్శకంగా వ్యవహరించకపోతే పెట్టుబడులు దెబ్బతింటాయని కేంద్ర మంత్రి సింగ్ ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేశారు. అవినీతి జరిగిందని స్పష్టంగా తేలితే చట్టబద్దంగా కుదుర్చుకొన్న ఏ కాంట్రాక్టునైనా విస్మరించలేమని కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి ఆనంద్ కుమార్ తేల్చిచెప్పారు.

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం వెనుక జపాన్ లేఖ రాయడం కారణంగా అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. పీపీఏలను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని జపాన్ సర్కార్ తప్పుబట్టింది.ఈ నిర్ణయం సహేతుకం కాదని కోర్టు అభిప్రాయపడింది.

సంబంధిత వార్తలు

వైఎస్ జగన్ కు జపాన్ కరెంట్ షాక్

పీపీఏల వల్ల రాష్ట్రానికి లాభం లేదు.. అందుకే రద్దు చేశాం: జగన్

జగన్ సర్కార్ కు తలనొప్పిగా పీపీఏల అంశం: హైకోర్టులో మరో రెండు పిటీషన్లు

మోదీ ప్రభుత్వంతో సమరానికి జగన్ సై : అగ్గిరాజేస్తున్న పీపీఏ అంశం

సోలార్, విండ్ కంపెనీల నుంచి విద్యుత్ నిలిపివేత: సీఎం జగన్ సంచలన నిర్ణయం

హైకోర్టులో జగన్ సర్కార్ కు చుక్కెదురు: పీపీఏల పున:సమీక్షకు బ్రేక్

జగన్ సర్కార్ కు అప్పిలేట్ ట్రిబ్యునల్ షాక్

click me!