అమరావతిపై ఏపీ ప్రభుత్వం పిటిషన్: ఈ నెల 23న విచారించనున్న సుప్రీంకోర్టు

By narsimha lodeFirst Published Feb 6, 2023, 12:42 PM IST
Highlights

అమరావతి అంశంపై ఈ నెల  23వ తేదీన  సుప్రీంకోర్టు విచారించనుంది.   రాజధాని  అంశంపై  కేసులను  వెంటనే విచారణ చేయాలని  సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం  కోరింది

అమరావతి: అమరావతి అంశంపై  ఏపీ ప్రభుత్వం దాఖలు  చేసిన   పిటిషన్  పై  ఈ నెల  23వ తేదీన సుప్రీంకోర్టు  విచారణ  నిర్వహించనుంది.  రాజధాని అంశానికి  సంబంధించి న పిటిషన్ పై విచారణ చేయాలని  ఏపీ  సర్కార్ ఈ  నెల 4వ తేదీన  సుప్రీంకోర్టు  రిజిష్ట్రార్  కు లేఖ రాసిన విషయం తెలిసిందే.

మూడు రాజధానుల అంశానికి సంబంధించి  ఏపీ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం  2022 మార్చి  మాసంలో  కీలక తీర్పును వెల్లడించింది. రాజధానిపై  చట్టం చేసే అధికారం ఏపీ ప్రభుత్వానికి లేదని  హైకోర్టు ధర్మాసనం తెలిపింది.  ఈ తీర్పును ఏపీ ప్రభుత్వం  సుప్రీంకోర్టులో  2022 సెప్టెంబర్  17వ తేదీన  సవాల్ చేసింది.  

ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన  సుప్రీంకోర్టు  కొన్ని అంశాలపై  స్టే  ఇచ్చింది.  కాలపరిమితితో  రాజధానిని పూర్తి చేయాలని  హైకోర్టు ఇచ్చిన తీర్పుపై  స్టే ఇచ్చింది. అమరావతి రాజధాని ప్రాంతంలో  ప్లాట్లను  అభివృద్ది చేసి  మూడు నెలల్లోపుగా  భూ యజమానులకు ఇవ్వాలని  హైకోర్టు ఇచ్చిన తీర్పుపై  స్టే ఇచ్చింది. అమరావతి రాజధానిపై  మాత్రం స్టే ఇవ్వలేదు. 

 ఈ పిటిషన్ పై  ఈ ఏడాది జనవరి  31న  విచారణ జరగాల్సి ఉంది.  అయితే ఆ రోజున  బెంచ్  సమావేశం కాలేదు. దీంతో  ఈ పిటిషన్ విచారణ జరగలేదు. దీంతో  ఈ కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలని  కోరుతూ  రాష్ట్ర ప్రభుత్వం  సుప్రీంకోర్టును కోరింది.  

రాజధాని అంశంపై  న్యాయ పరమైన  ఇబ్బందులను తొలగించుకొని విశాఖఫట్టణం నుండి పాలన సాగించాలని జగన్ సర్కార్ భావిస్తుంది. ఈ ఏడాది ఉగాది నుండి  విశాఖపట్టణం నుండి పాలన సాగించాలని  జగన్  సర్కార్ భావిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో  జరిగిన  గ్లోబల్  ఇవ్వెస్టర్స్ సమ్మిట్ లో  మార్చిలో  విశాఖలో  సమావేశం నిర్వహిస్తున్నట్టుగా  సీఎం జగన్  చెప్పారు. విశాఖపట్టణం  రాజధానిగా మారనుందని  సీఎం జగన్  ఈ సమావేశంలో  ప్రకటించిన విషయం తెలిసిందే.

also read:రాజధానిపై పిటిషన్ ఈ నెల 6న మెన్షన్ లిస్టులో చేర్చాలి: సుప్రీంను కోరనున్న ఏపీ సర్కార్

2014లో  చంద్రబాబునాయుడు  అమరావతిలో  రాజధానికి శంకుస్థాపన  చేశారు.  వైసీపీ సర్కార్  అధికారంలోకి వచ్చిన  తర్వాత  మూడు రాజధానుల అంశాన్ని  తెరమీదికి తీసుకువచ్చింది.

 


 

click me!