అప్పుడు బాదుడేబాదుడు అన్నారు.. ఇప్పుడు గుంజుడేగుంజుడు ప్రారంభించారు: వైసీపీపై యామినీ శర్మ ఫైర్

By Sumanth KanukulaFirst Published Feb 6, 2023, 11:56 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీపై బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు సాధినేని యామినీ శర్మ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో బాదుడేబాదుడు అన్నాడని.. సీఎం అయ్యాక గుంజుడేగుంజుడు ప్రారంభించారని విమర్శించారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీపై బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు సాధినేని యామినీ శర్మ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో బాదుడేబాదుడు అన్నాడని.. సీఎం అయ్యాక గుంజుడేగుంజుడు ప్రారంభించారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చేది పావలా అయితే వసూలు చేసేది రూపాయి అని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్‌లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని అన్నారు. అయితే ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే రాష్ట్ర రాజకీయ పార్టీలు, నేతలు బడ్జెట్‌పై ఉద్దేశ్యపూర్వకంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 

బడ్జెట్ మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తుందని, వారి సామాజిక, ఆర్థిక, వ్యాపార సామర్థ్యాలను విస్తృతం చేస్తుందని యామమినీశర్మ అన్నారు. నగరాల నుంచి గ్రామాల వరకు, ఉద్యోగుల నుంచి గృహిణుల వరకు.. బడ్జెట్ ప్రతి బాలిక, మహిళకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుందని ఆమె పేచెప్పారు. మహిళలు, బాలికలకు రక్షణ, సంరక్షణ, పోషకాహారం అందించడానికి కేంద్రం బడ్జెట్‌లో రూ. 25,000 కోట్లు కేటాయించినట్లు ఆమె తెలిపారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం మహిళలకు రక్షణ లేకుండా పోయింది. కేంద్రం ఇచ్చిన నిర్భయ నిధులను రాష్ట్రం పూర్తిగా వినియోగించుకోలేదన్నారు.

కేంద్రం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం హైజాక్ చేసి తమ పేరు, పార్టీ రంగులతో ప్రచారం చేసుకుంటోందన్నారు. గత టీడీపీ ప్రభుత్వం, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కేంద్రం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు తమ పేర్లు పెట్టుకున్నాయని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌లో మహిళల కోసం మరుగుదొడ్ల నిర్మాణానికి రూ. 12,000 కోట్లు కేటాయించిందని.. వాటిలో 45 లక్షలను కేంద్రం ఇప్పటికే నిర్మించిందని చెప్పారు. కానీ ఏపీ ప్రభుత్వం చెత్తపైనా పన్నులు విధించి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని విమర్శించారు. 

click me!