ప్రకాశం జిల్లా వైసీపీలో అసమ్మతి... ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మీటింగులు.. పార్టీ అధినేత వద్దే తేల్చుకోవాలంటూ..

By Asianet NewsFirst Published Feb 6, 2023, 12:17 PM IST
Highlights

ప్రకాశం జిల్లాలోని ఓ వైసీపీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రెండో స్థాయి నాయకులు మీటింగ్ లు ఏర్పాటు చేస్తున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేపైనే వారు అసంతృప్తి వ్యక్త ం చేస్తున్నారు. ఈ అసమ్మతి నేతలు త్వరలోనే జిల్లా ఇంఛార్జ్ మంత్రి, పార్టీ అధినేతను సంప్రదించనున్నారని తెలుస్తోంది. 

ఏపీ అధికార పార్టీలో అసమ్మతి మొదలైంది. పలువరు నేతలు రెబల్స్ గా మారుతున్నారు. చాలా కాలం నుంచి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం నారాయణ రెడ్డిలు కూడా ఆయన దారిలోనే ఉన్నారు. కొంత కాలం కింద ఆ పార్టీ నాయకుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో కూడా ఈ వ్యతిరేకత మొదలైంది. సంతనూతలపాడు శాసన సభ్యుడు సుధాకర్ బాబుకు ఆ జిల్లా నాయకులు వ్యతిరేకంగా మారారు. 

అప్పుడు బాదుడేబాదుడు అన్నారు.. ఇప్పుడు గుంజుడేగుంజుడు ప్రారంభించారు: వైసీపీపై యామినీ శర్మ ఫైర్

ఎమ్మెల్యే సుధాకర్ బాబు గుంటూరు జిల్లాకు చెందిన నాయకుడు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి శాసన సభకు పోటీ చేశారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ హయాంలో ఆయన విజయం సాధించారు. పక్క జిల్లాకు చెందిన నాయకుడైనప్పటికీ ఆయనకు ఓటేసి గెలిపించారు. ఎన్నికలు జరిగిన రెండేళ్ల వరకు అక్కడ పార్టీలో ఎలాంటి గొడవలూ జరగలేదు. తరువాత మెల్లగా గొడవలు మొదలయ్యాయి. ఇవి ముదరడంతో ఆ సమయంలో మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి రంగ ప్రవేశం చేశారు. పరిస్థితిని చల్లబర్చారు. 

రౌడీయిజానికి, ఫ్యాక్షన్‌కు తేడా తెలియదు.. ఆయన అసలు పేరు సింగారెడ్డి : శిల్పా రవికి అఖిలప్రియ కౌంటర్

అయితే అప్పటి నుంచి కూడా పార్టీలో ఎలాంటి లుకలుకలూ లేవు. కానీ తాజాగా ఆ ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన పార్టీ నాయకులు స్పెషల్ మీటింగ్ లు పెడుతున్నారు. నియోజకర్గంలో రెండో స్థాయి నేతలు తమకు అసలు ప్రియారిటీ ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మీటింగుల్లో చర్చలు ఓ కొలిక్కి వచ్చిన తరువాత దానిని డిస్ట్రిక్ట్ ఇంఛార్జ్ మంత్రికి, వైసీపీ అధినేతకు చెప్పాలని నిర్ణయించున్నారు. వచ్చే ఎలక్షన్ లో ఆ ఎమ్మెల్యేకు టికెట్ కేటాయించకూడదని సీఎం ముందు చెప్పాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 

బచ్చా అంటూ వ్యాఖ్యలు.. పవన్‌కు రాయాల్సిన లేఖ నాకు పంపినట్లున్నారు : హరిరామజోగయ్యకు గుడివాడ కౌంటర్

ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో వైసీపీలో ఇలా అసమ్మత గళం వినిపించడం పార్టీ నేతలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పుడే ఇలా ఉండే ఎన్నికల సమయంలో పరిస్థితి ఇంకెలా ఉంటుందో అని టెన్షన్ పడుతున్నారు. 

click me!