తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల 16న తీర్పు వెల్లడించనుంది ఉన్నత న్యాయస్థానం.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈ నెల 16న తీర్పును వెల్లడించనుంది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై 17 ఏ సెక్షన్ చుట్టూనే వాదనలు జరిగాయి. సెక్షన్ 17 ఏ తనకు వర్తిస్తుందని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే ఈ కేసులో చంద్రబాబుకు 17 ఏ సెక్షన్ వర్తించదని ఏపీ సీఐడీ తరపున న్యాయవాదులు వాదనలు విన్పించారు. ఈ విషయమై రాతపూర్వకమైన వాదనలు విన్పించేందుకు కూడ సుప్రీంకోర్టు సమయం ఇచ్చిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఈ నెల 16న ఈ విషయమై తీర్పును వెల్లడించనుంది.
undefined
also read:చంద్రబాబు, పవన్ కళ్యాణ్ డిన్నర్ భేటీ: సీట్ల సర్ధుబాటుపై చర్చ
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో 17 ఏ సెక్షన్ ను ఉల్లంఘించారని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు. . ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది.
also read:జనసేనలోకి ముద్రగడ?: కిర్లంపూడిలో పద్మనాభంతో భేటీకి పవన్
ఈ కేసులో కూడ 17 ఏ సెక్షన్ గురించి అప్పట్లో చంద్రబాబు తరపు న్యాయవాదులు ప్రస్తావించారు. స్కిల్ కేసులో 17 ఏ సెక్షన్ వర్తిస్తుందా లేదా అనే విషయమై సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించిన తర్వాత ఫైబర్ నెట్ కేసుపై విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ధర్మాసనం అప్పట్లో ప్రకటించింది.
also read:మాగుంటతో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం భేటీ: ఏం జరుగుతుంది?
ఇదిలా ఉంటే ఐఆర్ఆర్, మద్యం కేసు, ఉచిత ఇసుక కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఈ నెల 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.