పవన్‌కు హరిరామజోగయ్య మరో లేఖ.. సీట్లు, సీఎం పదవిపై తగ్గొద్దంటూ సూచనలు

Siva Kodati |  
Published : Jan 13, 2024, 05:18 PM ISTUpdated : Jan 13, 2024, 05:22 PM IST
పవన్‌కు హరిరామజోగయ్య మరో లేఖ..  సీట్లు, సీఎం పదవిపై తగ్గొద్దంటూ సూచనలు

సారాంశం

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి హరిరామ జోగయ్య మరో బహిరంగ లేఖను విడుదల చేశారు. పవన్ కళ్యాణ్‌ను సీఎంగా చూడాలని జనసైనికులు భావిస్తున్నారని, కనీసం రెండున్నరేళ్లయినా పవన్ ముఖ్యమంత్రిగా వుండాలని హరిరామజోగయ్య పేర్కొన్నారు. 

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి హరిరామ జోగయ్య మరో బహిరంగ లేఖను విడుదల చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వెళ్లాల్సిన ఆవశ్యకతపై పవన్ కళ్యాణ్‌తో చర్చించడం జరిగిందన్నారు. 40 నుంచి 60 సీట్లు జనసేన దక్కించుకోవాల్సి వుందని, 40 వరకు సీట్లు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారని జోగయ్య వెల్లడించారు. పవన్ కళ్యాణ్‌ను సీఎంగా చూడాలని జనసైనికులు భావిస్తున్నారని, కనీసం రెండున్నరేళ్లయినా పవన్ ముఖ్యమంత్రిగా వుండాలని హరిరామజోగయ్య పేర్కొన్నారు. జనసేన టీడీపీలో కూటమిలో త్వరలో బీజేపీ కూడా చేరే అవకాశం వుందని పవన్ తనకు తెలిపినట్లు మాజీ మంత్రి వెల్లడించారు. 

మరోవైపు.. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరనున్నారు. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తరపున తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్, అమలాపురానికి చెందిన కాపు ఐకాస నేతలు శుక్రవారం కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి చేరుకుని రెండున్నర గంటల పాటు చర్చలు జరిపారు. అనంతరం బొలిశెట్టి మీడియాతో మాట్లాడతూ.. ముద్రగడ పద్మనాభం జనసేనపలో చేరడం ఖాయమని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కూడా కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ నివాసానికి స్వయంగా వెళ్లి పార్టీలోకి ఆహ్వానిస్తారని బొలిశెట్టి స్పష్టం చేశారు. ఈ నెల 20 లేదా 23న ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరుతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్