అప్పుడు పొత్తు ఎందుకు పెట్టుకున్నావ్.. భయంతోనే బాబుపై కేసీఆర్ విమర్శలు: సోమిరెడ్డి

By sivanagaprasad kodatiFirst Published Oct 4, 2018, 1:35 PM IST
Highlights

ప్రజా ఆశీర్వాద సభలో భాగంగా నిజామాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు.. కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు.. 

ప్రజా ఆశీర్వాద సభలో భాగంగా నిజామాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు.. కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు.. తాజాగా ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కేసీఆర్‌పై ఫైరయ్యారు.

తెలంగాణ ఉన్నన్నాళ్లూ టీడీపీ ఉంటుందని.. నిరాశ, నిస్పృహలతోనే కేసీఆర్ తమ అధినేతపై ఆరోపణలు చేశారన్నారు. ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతోనే కేసీఆర్ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారని.. వాటని ప్రజలు హర్షించరని సోమిరెడ్డి అన్నారు.

చంద్రబాబు వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని చెప్పిన మాటలను కేసీఆర్ మరచిపోయారని చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. సైబరాబాద్ సృష్టికర్త చంద్రబాబని.. తెలంగాణను నాశనం చేశారనడం బాధాకరమని సోమిరెడ్డి అన్నారు.

మోడీ నుంచి కేసీఆర్ వరకు చంద్రబాబు అంటే భయపడుతున్నారని...ఆయనపై వ్యాఖ్యలు చేస్తే కేసీఆర్‌కు నష్టమే తప్ప లాభం ఉండదని సోమిరెడ్డి హితవు పలికారు. 2004లో కాంగ్రెస్‌తో, 2009లో టీడీపీతో కేసీఆర్ ఎందుకు పొత్తుపెట్టుకున్నారని మంత్రి ప్రశ్నించారు. రూ.500 కోట్లు కాదు కదా, రూ.5 కోట్లు కూడా తెలంగాణకు పంపాల్సిన కర్మ పట్టలేదన్నారు. కేసీఆర్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జోస్యం చెప్పారు.

టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ వాయిదా.. కేసీఆర్ అనూహ్య నిర్ణయం

నిజామాబాద్ ప్రజా ఆశిర్వాద సభలో కేసీఆర్ (పోటోలు)

టీఆర్ఎస్ కు ఈసీ షాక్

కాంగ్రెస్, టీడీపీ పొత్తు ఎఫెక్ట్: కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రం

రేవంత్ విచారణ: కేసీఆర్ నోట చంద్రబాబు పేరు, దేనికి సంకేతం?

ఓటుకు నోటులో అడ్డంగా దొరికిన దొంగ: బాబుపై కేసీఆర్ సంచలనం

కాంగ్రెస్ ఎఫెక్ట్: మళ్లీ అధికారంలోకి వస్తే పెన్షన్‌ను పెంచుతాం: కేసీఆర్

click me!