కేసీఆర్ కి ఓటమి భయం పట్టుకుంది.. సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

Published : Oct 04, 2018, 12:43 PM IST
కేసీఆర్ కి ఓటమి భయం పట్టుకుంది.. సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

సారాంశం

చంద్రబాబు వల్లే హైదరాబాద్‌ నగరం అభివృద్ధి చెందిందని మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను కేసీఆర్‌ మరిచారా? అని ప్రశ్నించారు. 

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రానున్న నేపథ్యంలో కేసీఆర్ కి ఓటమి భయం పట్టుకుందని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆ ఓటమి భయంతోనే టీడీపీపై విమర్శలు చేస్తున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు.

ప్రధాని మోదీ నుంచి కేసీఆర్‌ వరకు అందరికీ చంద్రబాబు భయం పట్టుకుందని విమర్శించారు. చంద్రబాబును ఎంత తిడితే అన్ని ఓట్లు వస్తాయనే భ్రమలో కేసీఆర్‌ ఉన్నారని.. తెలుగు ప్రజలంతా దీనిని నిశితంగా గమనిస్తున్నారని అన్నారు. చంద్రబాబు వల్లే హైదరాబాద్‌ నగరం అభివృద్ధి చెందిందని మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను కేసీఆర్‌ మరిచారా? అని ప్రశ్నించారు. 

టీడీపీ నుంచి రాజకీయ నేతగా ఎదిగిన కేసీఆర్‌ తాను నడిపిన మంత్రివర్గంలో సగంమంది టీడీపీ గూటికి చెందిన వాళ్లేనన్న సత్యాన్ని ఆయన గ్రహించాలన్నారు. కేసీఆర్‌ వల్లే తెలంగాణకు నష్టం వాటిల్లుతుందనే వాస్తవాన్ని తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారని సోమిరెడ్డి పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
Bus Accident : అల్లూరి జిల్లాలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి