మాజీ ఎమ్మెల్యే సోమ మావోయిస్టులకు చిక్కాడిలా....

By narsimha lodeFirst Published Sep 23, 2018, 4:13 PM IST
Highlights

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే  సివిరి సోమలు గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొంటారనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకొన్న  మావోయిస్టులు పథకం ప్రకారంగా ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, సోమపై ఆదివారం నాడు కాల్పులు జరిపారు


అరకు:  అరకు ఎమ్మెల్యే కిడారి సర్వశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే  సివిరి సోమలు గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొంటారనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకొన్న  మావోయిస్టులు పథకం ప్రకారంగా ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, సోమపై ఆదివారం నాడు కాల్పులు జరిపారు.ఈ ఘటన నుండి తప్పించుకొనేందుకు చివరినిమిషంలో మాజీ ఎమ్మెల్యే సివిరి సోమ ప్రయత్నాలను మావోయిస్టులు తిప్పికొట్టారు.

లిప్పిటిపుట్టు గ్రామ సమీపంలోకి ఎమ్మెల్యే సర్వేశ్వరరావు,  మాజీ ఎమ్మెల్యే సివిరి సోమ వాహన శ్రేణి చేరుకొంటున్న విషయాన్ని గుర్తించిన మావోయిస్టులు చెట్ల పొదల్లో నుండి రోడ్డుపై అడ్డంగా నిలబడి తుపాకులు ఎక్కుపెట్టారు.

రోడ్డుపై హఠాత్తుగా మావోయిస్టులు ఎమ్మెల్యే ప్రయాణీస్తున్న వాహనానికి ఎదురుగానే  తుపాకులు ఎక్కుపెట్టారు. వాహనం చుట్టుముట్టారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే సివిరి సోమ వాహనం కూడ  ఆ వాహనం వెనుకే వచ్చింది. అయితే మావోయిస్టులను చూసిన ఆ వాహన డ్రైవర్  తన వాహనాన్ని వెనక్కు తిప్పేందుకు  ప్రయత్నించాడు.

అయితే సోమ వాహనం వెనక్కు తిప్పుతుండగా సోమ వాహనాన్ని కూడ మావోయిస్టులు చుట్టుముట్టారు.ఎమ్మెల్యే సర్వేశ్వరరావుతో పాటు , మాజీ ఎమ్మెల్యే సోమ గన్‌మెన్ల వద్ద ఉన్న ఆయుధాలను లాక్కొన్నారు. పిఏలను, కార్యకర్తలను పక్కకు పంపించారు. ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను పక్కకు తీసుకెళ్లారు.

బాక్సైట్ తవ్వకాలకు సహకరిస్తున్నారని సర్వేశ్వరరావుపై మావోయిస్టులు ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు  గూడ క్వారీ గురించి కూడ ప్రశ్నించారు.భార్య, పిల్లలను  పోషించేందుకు పోలీసు ఉద్యోగాలు నిర్వహిస్తున్నారని  గన్‌మెన్లను ఉద్దేశించి మావోయిస్టులు చెప్పారు.

సోమ వాహనం వద్దకు వచ్చి సోమ గురించి ఆరా తీశారు. సోమను కారులో నుండి బయటకు దించి చేతులు వెనక్కుకట్టి నడిపించుకొంటూ తీసుకెళ్లారు. వాహనంలో ఉన్న ఇతరులను కూడ  అక్కడే నిలిపివేసి సాయుధ మావోయిస్టులు కాపలాగా ఉన్నారని  సోమ డ్రైవర్ చిట్టిబాబు చెప్పారు.

మరోవైపు వాహనాన్ని ముందుకు తీసుకెళ్తే బాంబులతో పేల్చివేస్తామని మావోయిస్టులు హెచ్చరించారు. దీంతో కారును ముందుకు తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొందని డ్రైవర్ చెప్పారు. ఇదిలా ఉంటే పారిపోయే ప్రయత్నం చేస్తే ఎన్‌కౌంటర్ చేస్తామని కూడ హెచ్చరించారని చిట్టిబాబు చెప్పారు.

సంబంధిత వార్తలు

పోలీసులకు చెప్పకుండానే గ్రామదర్శినికి వెళ్తూ మార్గమధ్యలోనే ఇలా....

వాహనంలో ఎవరెవరున్నారని ఆరా తీసి....కాల్పులు: ప్రత్యక్షసాక్షి

గన్‌మెన్ల ఆయుధాలు లాక్కొని కాల్పులు: డీఐజీ

మావోల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి (వీడియో)

ఆ క్వారే కొంపముంచిందా: సర్వేశ్వరరావుపై దాడి వెనుక..
ఎమ్మెల్యే హత్య: అమెరికాలోని బాబుకు సమాచారం

ఎమ్మెల్యే హత్య: దాడిలో 60 మంది మావోలు.. 40 మంది మహిళలే

నాన్నను ఎందుకు చంపారో తెలియదు: కుమారుడు నాని

పబ్లిసిటీ కోసమే మావోలు ఎమ్మెల్యేను చంపారు: రిటైర్డ్ ఐపీఎస్

click me!