పోలీసులకు చెప్పకుండానే గ్రామదర్శినికి వెళ్తూ మార్గమధ్యలోనే ఇలా....

By narsimha lodeFirst Published Sep 23, 2018, 3:41 PM IST
Highlights

ఏజేన్సీ ప్రాంతంలో గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనే విషయాన్ని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు  పోలీసులకు సమాచారం ఇవ్వలేదు

విశాఖపట్టణం: ఏజేన్సీ ప్రాంతంలో గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనే విషయాన్ని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు  పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. గతంలో సర్వేశ్వరరావుకు మావోయిస్టుల నుండి బెదిరింపులు వచ్చాయి. అయినా పోలీసులకు సమాచారం ఇవ్వలేదని పోలీసులు ప్రకటించారు.

అరకు ఎమ్మెుల్యే కిడారి సర్వేశ్వరరావు వైసీపీ నుండి టీడీపీలో చేరారు. గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనేందుకుగాను సర్వేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే సివిరిసోమతో కలిసి ఆదివారం నాడు మధ్యాహ్నం 11 గంటలకు  అరకు నుండి  బయలుదేరాడు.

డుబ్రీగుంట మండలం లిప్పిట్టిపుట్టు వద్దకు చేరుకోగానే  మావోయిస్టులు  సర్వేశ్వరరావు వాహాన్ని చుట్టుముట్టారు. ఎమ్మెల్యే సర్వేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే సివిరి సోమను కూడ మావోయిస్టులు  వేర్వేరుగా తమ వెంట తీసుకెళ్లారు. ఆ తర్వాత వీరిద్దరితో వేర్వేరు విషయాలపై మాట్లాడినట్టు సమాచారం.

క్వారీ విషయమై సర్వేశ్వరరావుతో మావోలు చర్చించారు. ఒడిశాలో ఎన్‌కౌంటర్ విషయమై సోమతో మావోలు చర్చించారు. క్వారీ గురించి చర్చల సందర్భంగా సామరస్యపూర్వకంగా చర్చిద్దామని సర్వేశ్వరరావు చేసిన ప్రతిపాదనను కూడ మావోలు తోసిపుచ్చారు. సర్వేశ్వరరావును కాల్చి చంపారు.  మరోవైపు సివిరి సోమతో చర్చిస్తూనే మావోలు కాల్చి చంపారు.

సంబంధిత వార్తలు

వాహనంలో ఎవరెవరున్నారని ఆరా తీసి....కాల్పులు: ప్రత్యక్షసాక్షి

గన్‌మెన్ల ఆయుధాలు లాక్కొని కాల్పులు: డీఐజీ

మావోల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి (వీడియో)

ఆ క్వారే కొంపముంచిందా: సర్వేశ్వరరావుపై దాడి వెనుక..
ఎమ్మెల్యే హత్య: అమెరికాలోని బాబుకు సమాచారం

ఎమ్మెల్యే హత్య: దాడిలో 60 మంది మావోలు.. 40 మంది మహిళలే

నాన్నను ఎందుకు చంపారో తెలియదు: కుమారుడు నాని

పబ్లిసిటీ కోసమే మావోలు ఎమ్మెల్యేను చంపారు: రిటైర్డ్ ఐపీఎస్

click me!