ఏపీకి మూడు రాజధానులు అంటూ జగన్ చేసిన ప్రకటనపై అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు నిరసనకు దిగారు. రెండో రోజు కూడ రైతులు ఆందోళన చేస్తున్నారు.
అమరావతి: ఏపీకి మూడు రాజధానులు అంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటనపై అమరావతి పరిసర గ్రామాల ప్రజలు రెండో రోజైన శుక్రవారం నాడు కూడ నిరసనలు కొనసాగిస్తున్నారు.
Also read: ఏపీకి మూడు రాజధానులు: వెలగపూడిలో రైతుల దీక్షలు
మూడు రోజుల క్రితం ఏపీకి మూడు రాజధానులు అనే సంకేతాలను ఇచ్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్. దీంతో రెండు రోజులుగా అమరావతిలో రైతులు ఆందోళన చేస్తున్నారు.
Also read: నేడు జగన్‌కు రాజధానిపై నిపుణుల కమిటీ తుది నివేదిక
శుక్రవారం నాడు కూడ రాజదాని గ్రామాల రైతులు తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. ఇవాళ రైతులు మహా ధర్నాలకు పిలుపు నిచ్చారు. వంటావార్పు చేస్తున్నారు. రోడ్లపైనే వంటలు చేస్తూ తమ నిరసనను కొనసాగిస్తున్నారు. తుళ్లూరు, రాయపూడి గ్రామాల్లో రోడ్డుపైనే వంటావార్పు చేశారు. వెలగపూడిలో రైతులు రిలే నిరహార దీక్షలు కొనసాగిస్తున్నారు.
Also read:ఏపీకి మూడు రాజధానులు : పురుగుల మందు డబ్బాలతో రోడ్డు మీదికి...
తుళ్లూరులో ఉదయం ఏడు గంటల నుండే వాహనాల రాకపోకలను రైతులు అడ్డుకొన్నారు. తుళ్లూరు తులసి సెంటర్‌లో రైతులు వంటా వార్పు చేసి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.
Also read:రాజధానిపై నిపుణుల కమిటీ: జగన్ సర్కార్‌కు హైకోర్టు నోటీసులు
రైతుల ఆందోళనలను దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతుల ఆందోళనను దృష్టిలో ఉంచుకొని ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఎనిమిది మంది డీఎస్పీలు, 15 మంది ఎస్ఐలు, 32 మంది ఎస్ఐలు, 600 మంది కానిస్టేబుళ్లతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
సచివాలయానికి వెళ్లే ప్రధాన రహదారిపై బైఠాయించి రైతులు ఆందోళన చేస్తున్నారు. సచివాలయానికి వెళ్లే ఉద్యోగులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సచివాలయానికి వెళ్తున్నారు.గురువారం నాడు కూడ రైతులు ఇదే రకంగా ప్రధాన రహాదారిపై బైఠాయించి ఆందోళన చేశారు.