పెళ్లికి అంగీకరించలేదని ప్రేమ జంట ఆత్మహత్య... ప్రియురాలి మృతి

Published : Dec 20, 2019, 08:39 AM IST
పెళ్లికి అంగీకరించలేదని ప్రేమ జంట ఆత్మహత్య... ప్రియురాలి మృతి

సారాంశం

గాంధీనగర్ కు  చెందిన నాగగౌతమి, లోకేష్ లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఆత్మహత్యకు యత్నించారు. 

పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో యువతి కన్నుమూయగా.. యువకుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ సంఘటన విజయవాడలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... విజయవాడ గాంధీనగర్ కు  చెందిన నాగగౌతమి, లోకేష్ లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో ప్రియురాలు నాగగౌతమి అక్కడికక్కడే మృతి చెందగా, ప్రియుడు లోకేష్ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.

వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాంధీనగర్‌ జగపతి హోటల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడు గుడివాడకు చెందిన వ్యక్తి కాగా, మృతురాలు నాగ గౌతమి ఓ ప్రైవేట్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌‌గా పనిచేస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే