మూడు కాదు.. 33 రాజధానులు పెట్టుకుంటాం.. మంత్రి పెద్దిరెడ్డి షాకింగ్ కామెంట్స్

Published : Dec 20, 2019, 09:13 AM IST
మూడు కాదు.. 33 రాజధానులు పెట్టుకుంటాం.. మంత్రి పెద్దిరెడ్డి షాకింగ్ కామెంట్స్

సారాంశం

అమరావతిలో రైతుల భూములను వెనక్కి ఇచ్చేస్తామన్నారు. రాజధానిలో భూములు వెనక్కి ఇస్తామని ఎన్నికల ముందే జగన్‌ చెప్పారని వెల్లడించారు. అమరావతిలో టీడీపీ కార్యకర్తలే ఆందోళనలు చేస్తున్నారన్నారు. విశాఖలో ఇప్పటికే భూముల ధరలు పెరిగాయన్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని మూడు రాజధానుల వివాదం నడుస్తోంది. కాగా....ఈ వివాదంపై తాజాగా... మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. మూడు రాజధానులు కాదు.. 30 రాజధానుల పెట్టుకుంటామంటూ వివాదాస్పద కామెంట్స్  చేశారు.  అమరావతిలో రైతుల భూములను వెనక్కి ఇచ్చేస్తామన్నారు. రాజధానిలో భూములు వెనక్కి ఇస్తామని ఎన్నికల ముందే జగన్‌ చెప్పారని వెల్లడించారు. అమరావతిలో టీడీపీ కార్యకర్తలే ఆందోళనలు చేస్తున్నారన్నారు. విశాఖలో ఇప్పటికే భూముల ధరలు పెరిగాయన్నారు.
 
విశాఖలో భూములు కొన్నామని అనడం సరైంది కాదని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. సచివాలయం తాత్కాలికమని చంద్రబాబే చెప్పారన్నారు. మూడు కాకపోతే 33 రాజధానులు పెట్టుకుంటామని తెలిపారు. రాజధానులకు కేంద్రం అనుమతులు, నిధులు అవసరం లేదని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. మార్చిలో స్థానిక ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్‌ ఇస్తామన్నారు. తెలంగాణ తరహాలో ఇంటింటికి తాగునీరు ఇస్తామని పెద్దిరెడ్డి తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?