శ్వాస తీసుకోవడానికి కోడెల ఇబ్బంది: ప్రభుత్వ ఒత్తిడి వల్లనే...

By telugu teamFirst Published Aug 24, 2019, 12:15 PM IST
Highlights

జగన్ ప్రభుత్వ ఒత్తిడి వల్లనే కోడెల శివప్రసాద రావు ఆరోగ్యం క్షీణించిందని టీడీపి నేత నక్కా ఆనందబాబు వివరించారు. శ్వాస తీసుకోవడానికి కోడెల ఇబ్బంది పడుతున్నారని ఆయన బంధువు చెప్పారు.

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని ఆయన బంధువు మీడియాకు చెప్పారు. గుండెపోటుతో ఆయన శుక్రవారం రాత్రి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. 

కోడెల ఆరోగ్యం నిలకడగానే ఉందని, శ్రీలక్ష్మీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఐసియూలో ఆయనకు చికిత్స జరుగుతోందని కోడెల బంధువు చెప్పారు. కోడెల ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారని, ఇతర ఆస్పత్రుల వైద్యులు కూడా కోడెల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

కోడెల చికిత్స పొందుతున్న ఆస్పత్రికి టీడీపి నేతలు నక్కా ఆనందబాబు, జీవీ ఆంజనేయులు వెళ్లారు. కోడెల అనారోగ్య పరిస్థితికి వైసిపి ప్రభుత్వ ఒత్తిళ్లే కారణమని నక్కా ఆనంబాబు విమర్శించారు. కోడెల కుటుంబ సభ్యులపై జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని ఆయన విమర్శించారు.  

సంబంధిత వార్తలు

నిలకడగా కోడెల ఆరోగ్యం... హైదరాబాద్ కి తరలింపు?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు

కోడెల ఫర్నీచర్ దోచేస్తే, చంద్రబాబు ప్రజాధనాన్ని దాచేశారు : ఇద్దరూ దొంగలేనన్న ఏపీ మంత్రి

నా ఆఫీసులో చోరీ వెనుక వైసీపీ.. దుండగుడు ఆ పార్టీ వ్యక్తే: కోడెల

కోడెల ఇంట్లో చోరీ: కంప్యూటర్లను ఎత్తుకెళ్లిన మాజీ ఉద్యోగులు, పలు అనుమానాలు

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

అధికారాన్ని అభివృద్ధికి వాడండి.. బురద జల్లడానికి కాదు: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ నేనే వాడుకున్నా..డబ్బులు కట్టేస్తా: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ మాయం: కోడెల మెడకు మరో ఉచ్చు..?

కోడెల ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపుపై విచారణ : చీఫ్ మార్షల్ పై తొలివేటు

click me!