పోలవరం కాంట్రాక్ట్ రద్దుపై డివిజన్ బెంచ్ కు జగన్ సర్కార్

By telugu team  |  First Published Aug 24, 2019, 11:57 AM IST

పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దును నిలిపేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పును వైఎస్ జగన్ ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాలు చేసే అవకాశం ఉంది. పోలవరంపై, తిరుమలలో అన్యమత ప్రచార వివాదంపై ఆయన మంత్రులతో చర్చించనున్నారు. 


అమరావతి: పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ రద్దు చెల్లదన్న కోర్టు తీర్పుపై డివిజన్ బెంచ్ కు వెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టుపై శనివారం సాయంత్రం ఐదు గంటలకు జరిగే సమీక్షా సమావేశంలో ఆ విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పోలవరం, హైడల్ పనులపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి వివరిస్తారు. 

జగన్ అమెరికా పర్యటనను ముగించుకుని రాష్ట్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా అందుబాటులో ఉన్న మంత్రులతో ఆయన అత్యవసరంగా సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై ఆయన ఈ సమావేశంలో చర్చించనున్నారు. తిరుమలలో బస్సు టికెట్లపై అన్యమత ప్రచారంపై కూడా ఆయన చర్చించే అవకాశం ఉంది. 

Latest Videos

పోలవరంపై, వరద పరిస్థితులపై జగన్ సమావేశంలో చర్చిస్తారని సమాచారం. తిరుమలలో వివాదానికి కారణమైన అన్యమత ప్రచారం వ్యవహారంపై మంత్రి పేర్ని నాని ముఖ్యమంత్రికి వివరిస్తారు. ఈ వివాదంపై తలపెట్టిన మీడియా సమావేశాన్ని నాని రద్దు చేసుకున్నారు. ముఖ్యమంత్రికి వివరాలు అందించిన తర్వాత ఆయన సూచనలు, సలహాల మేరకు మీడియాతో నాని మాట్లాడే అవకాశం ఉంది. ఈ ఉద్దేశంతోనే ఆయన మీడియా సమావేశాన్ని రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

జగన్ ఇప్పుడేం చెబుతారు: పోలవరంపై హైకోర్టు ఉత్తర్వులపై బాబు

జగన్‌కు హైకోర్టు షాక్: రివర్స్ టెండరింగ్ పై మధ్యంతర ఉత్తర్వులు

తగ్గని జగన్: పోలవరం అథారిటీకి కౌంటర్
పోలవరంపై నవయుగ పిటిషన్: వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్

పోలవరం: జగన్ సర్కార్ నిర్ణయంపై కోర్టుకెక్కిన నవయుగ

జగన్‌కు షాక్: రివర్స్ టెండరింగ్‌పై పీపీఏను నివేదిక కోరిన కేంద్రం

సీఈఓ లేఖ బేఖాతరు: పోలవరం పనులకు రివర్స్ టెండర్ల ఆహ్వానం

రివర్స్ టెండరింగ్ పై సీఈఓ లేఖ: జగన్ నిర్ణయంపై ఉత్కంఠ

నష్టమే: రివర్స్ టెండరింగ్‌పై జగన్ సర్కార్ కు జైన్ లేఖ

సీఈవో హెచ్చరికలు బేఖతారు: పోలవరంపై మడిమ తిప్పని జగన్

రీటెండరింగ్ వద్దు, నవయుగే ముద్దు: సీఎం జగన్ కు సీపీఐ రామకృష్ణ లేఖ

జైన్ షాక్: జగన్‌ రివర్స్ టెండరింగ్ తడిసి మోపెడు

click me!