కిడారి హత్య : నాటుకోడి విందులో పోలీసులు.. జీలుగ కల్లు మత్తులో మావోలు

By sivanagaprasad kodatiFirst Published Oct 4, 2018, 7:55 AM IST
Highlights

విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసు విచారణలో పోలీసులకు దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.

విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసు విచారణలో పోలీసులకు దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే వందలాది మంది అనుమానితులను ప్రశ్నించిన పోలీసుల.. ఏడుగురిని అదుపులో తీసుకున్న సంగతి తెలిసిందే.

వారి నుంచి హత్యలకు సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టారు. జంట హత్యలకు ముందు రోజు రాత్రి స్థానిక పోలీసులు నాటుకోడితో విందు చేసుకోగా.. మావోయిస్టులు జీలుగ కల్లుతో మత్తులో మునిగినట్లుగా తెలుస్తోంది.

మావోలకు అత్యంత కీలక ప్రదేశంగా ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంటూ.. తరచూ పెట్రోలింగ్ నిర్వహించాల్సిన పోలీసులు అసలు ఆయా గ్రామాలకు వెళ్లడమే మానేసినట్లు తెలుస్తోంది. మైదాన ప్రాంతాల్లో పనిచేసి పనిష్మెంట్‌పై అరకు వచ్చిన ఓ పోలీస్ అధికారికి.. అక్కడి గిరిజనులు వారాంతాల్లో తప్పనిసరిగా నాటుకోడి పంపాల్సిందే.

ఒక్కోసారి శనివారం రాత్రి ఆ అధికారి సన్నిహితులతో  ‘విందు’ చేసుకుంటారని అధికారులకు నివేదికలు అందాయి. అలాగే సెప్టెంబర్ 22 రాత్రి కూడా విందు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

మరో వైపు ఎమ్మెల్యే కిడారి హత్యకు ముందుగానే ప్లాన్ చేసిన మావోలకు సహకారం అందించేందుకు ఒడిషా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలోని దండకారణ్యం నుంచి మరికొంత మంది మావోలు వచ్చారు. వారు సెప్టెంబర్ 22 రాత్రి అరకు సమీపంలో మకాం వేశారు. గిరిజనుల నుంచి జీలుగ కల్లు తెప్పించుకుని సేవించినట్లుగా సమాచారం. 

కిడారి,సోమ హత్యలో నా ప్రమేయం ఉంటే ఏ శిక్షకైనా సిద్ధం

కిడారి హత్యపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

మావోల నెక్ట్స్ టార్గెట్..గిడ్డి ఈశ్వరి.. భారీ భద్రత నడుమ పర్యటన

కిడారి హత్య: కారులో రూ.3 కోట్లు ఏమయ్యాయి?

ఎమ్మెల్యే హత్య: కిడారిని ట్రాప్ చేసి.. బంధువులే నమ్మకద్రోహం

కిడారి హత్య: పోలీసుల అదుపులో మాజీ ఎంపీటీసీ సుబ్బారావు

కిడారి హత్య: టీడీపీ నేత హస్తం, రెండోసారి మావోల ప్లాన్ సక్సెస్

click me!