మద్యాన్ని నిషేధిస్తా...ఆ తర్వాతే ఓట్లు అడుగుతా:వైఎస్ జగన్

By Nagaraju TFirst Published Oct 3, 2018, 9:22 PM IST
Highlights

 రాష్ట్రంలో మద్యం వ్యాపారం పెద్ద మాఫియాగా మారిపోయిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ నెల్లిమర్ల నియోజకవర్గం మెయిద జంక్షన్ లో మద్యం మాఫియాపై విరుచుకు పడ్డారు.

విజయనగరం: రాష్ట్రంలో మద్యం వ్యాపారం పెద్ద మాఫియాగా మారిపోయిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ నెల్లిమర్ల నియోజకవర్గం మెయిద జంక్షన్ లో మద్యం మాఫియాపై విరుచుకు పడ్డారు. రాష్ట్రంలో తాగడానికి మినరల్ వాటర్ ఉండదు కానీ ఒక్కో ఊర్లో నాలుగు అయిదు బెల్ట్ షాపులు మాత్రం ఉంటాయని ఆరోపించారు. 

వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యాన్ని నిషేధిస్తానని తెలిపారు. 2024వరకు మద్యం లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. కేవలం ఫైవ్ స్టార్ హోటల్ లోనే తప్ప మరెక్కడా మద్యం దొరక్కుండా చేస్తానన్నారు. మద్యం లేకుండా చేసిన తర్వాతనే 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగేందుకు వస్తానని స్పష్టం చేశారు. 

అలాగే ప్రతీ ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీ మహిళలకు ప్రతీ ఏటా 75వేల రూపాయలు సున్నా వడ్డీకే అందజేస్తామని తెలిపారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు కట్టించి వారికి తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాలు అందని వారికి 72 గంటల్లో అందేలా చేస్తానని భరోసా ఇచ్చారు. 

click me!