జగన్, పవన్ లను జనం పట్టించుకోరు, మళ్లీ బాబే సీఎం:రాయపాటి

Published : Nov 15, 2018, 04:46 PM IST
జగన్, పవన్ లను జనం పట్టించుకోరు, మళ్లీ బాబే సీఎం:రాయపాటి

సారాంశం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రజల్లో ఎలాంటి ఆదరణ లేదని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు అభిప్రాయపడ్డారు. గురువారం గుంటూరులో మాట్లాడిన రాయపాటి జగన్, పవన్ సభలకు జనం వస్తున్నా ఓట్లు వెయ్యరంటూ వ్యాఖ్యానించారు.  

గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రజల్లో ఎలాంటి ఆదరణ లేదని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు అభిప్రాయపడ్డారు. గురువారం గుంటూరులో మాట్లాడిన రాయపాటి జగన్, పవన్ సభలకు జనం వస్తున్నా ఓట్లు వెయ్యరంటూ వ్యాఖ్యానించారు.

వచ్చే ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబు నాయుడే సీఎం అవుతారని అందులో ఎలాంటి సందేహమే లేదని రాయపాటి ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ అనుభవం, ప్రభుత్వ పథకాలు మళ్లీ చంద్రబాబును సీఎం చేస్తాయని తెలిపారు. 

మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పెద్ద అవినీతి పరుడంటూ ఆరోపించారు రాయపాటి. ఒకప్పుడు రేకుల షెడ్డులో ఉండే కన్నాకు రూ. వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబును విమర్శించే అర్హత కన్నా లక్ష్మీనారాయణకు లేదన్నారు. 

అటు కాంగ్రెస్-టీడీపీ పొత్తు తెలంగాణ వరకే పరిమితమని అన్నారు. ఏపీలో అవసరం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను, తన కుమారుడు ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధమని రాయపాటి స్పష్టం చేశారు.
 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు