ఆ క్షమాపణలు అక్కర్లేదు: వైసీపి నేతల వ్యాఖ్యలపై నారా భువనేశ్వరి

By narsimha lode  |  First Published Dec 20, 2021, 3:07 PM IST

వైసీపీ నేతల విమర్శలను తాను పట్టించుకోనని టీడీపీ చీఫ్ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చెప్పారు.


అమరావతి: వైసీపీ నేతల విమర్శలను పట్టించుకోనని టీడీపీ చీఫ్ చంద్రబాబు సతీమణి  Nara bhuvaneshwari తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను పురస్కరించుకొని తిరుపతిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భువనేశ్వరి తిరుపతికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె సోమవారం నాడు మీడియాతో మాట్లాడారు. ఆడపిల్లలంటే ఆట వస్తువులు కాదన్నారు.  తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి క్షమాపణలు తనకు అక్కర్లేదన్నారు. ఆడపిల్లలంటే ఆట వస్తువులు కాదన్నారు. అతి పెద్ద రాష్ట్రాన్ని Chandrababu ఏ విధింగా అభివృద్ది చేశారో అందరికీ తెలుసునని చెప్పారు. రాత్రి పగలు అనే తేడా రాష్ట్రాన్ని అభివృద్ది చేశారని ఆమె గుర్తు చేశారు. 
రాష్ట్ర రాజధానిగా Amaravati ఉండాలన్నారు. అమరావతే రాష్ట్ర రాజధానిగా ఉంటుందనే ఆకాంక్షను ఆమె వ్యక్తం చేశారు. 

also read:రేపు తిరుపతిలో పర్యటించనున్న చంద్రబాబు సతీమణి భువనేశ్వరి.. ఎందుకోసమంటే..

Latest Videos

గత మాసంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో తన భార్య గురించి వైసీపీ సభ్యులు అసభ్యంగా వ్యాఖ్యలు చేశారని చంద్రబాబునాయుడు మీడియా సమావేశంలోనే కన్నీళ్లు పెట్టుకొన్నారు. ఈ విషయమై  గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నారా భువనేశ్వరికి క్షమాపణలు చెప్పారు. నారా భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపాయి.ఈ వ్యాఖ్యలపై తాను అసెంబ్లీలోనే స్పందించేందుకు ప్రయత్నిస్తే స్పీకర్ మైక్ కట్ చేశారని చంద్రబాబు నాయుడు  సహా టీడీపీ సభ్యులు చెప్పారు. అయితే  ఈ సమయంలో మైక్ కట్ చేసినా కూడా  చంద్రబాబునాయుడు తాను చెప్పాలనుకొన్న అంశాన్ని సభలోనే ప్రకటించారు.  సీఎంగానే తాను సభలో అడుగు పెడతానని చంద్రబాబునాయుడు ప్రకటించారు.  

Ap Assembly చంద్రబాబునాయుడు సతీమణి గురించి ఎవరూ కూడా అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ సహా ఆ పార్టీకి చెందిన పలువురు సభ్యులు తెలిపారు. అయితే ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత గన్నవరం ఎమ్మెల్యే Vallabhaneni Vamsi భువనేశ్వరికి క్షమాపణలు చెబుతున్నట్టుగా మీడియా ఇంటర్వ్యూల్లో ప్రకటించారు.ఈ వ్యాఖ్యలపై  తొలిసారిగా భువనేశ్వరీ  వ్యాఖ్యానించారు. భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలపై నందమూరి కుటుంబ సభ్యులు కూడా స్పందించారు.  బాలకృష్ణ సహా  పలువురు నందమూరి కుటుంబ సభ్యులు ఈ విషయమై ycp ప్రజా ప్రతినిధులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.ఈ తరహా వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించారు.  భవిష్యత్తులో ఇలానే చేస్తే చూస్తూ ఊరుకోబోమని Balakrishna హెచ్చరించారు. ఎన్టీఆర్ ట్రస్టు కార్యక్రమాల్లో నారా భువనేశ్వరి చాలా చురుకుగా పాల్గొంటారు.ఎంత బిజీగా ఉన్నా కూడా ట్రస్ట్ కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటారు.  గత మాసంలో భారీ వర్షాలు  ఏపీ రాష్ట్రంలోని నెల్లూరు, చిత్తూరు, కుడప జిల్లాలను అతలాకుతలం చేశాయి.  దీంతో చిత్తూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్టీఆర్ ట్రస్టు సేవా కార్యక్రమాలను చేపట్టింది.ఈ కార్యక్రమాలను ప్రారంభించడానికి భువనేశ్వరి ఇవాళ తిరుపతికి వచ్చారు. 


 

click me!