తల, చేతిపై గాయాలు: వైఎస్ వివేకా మరణం వెనుక కుట్ర కోణం..?

By Siva KodatiFirst Published Mar 15, 2019, 10:09 AM IST
Highlights

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, వైఎస్ వివేకానందరెడ్డి మరణంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. వివేక రక్తపు మడుగులో పడివుండటం, తల, చేతిపై బలమైన గాయాలు ఉండటం ఈ అనుమానాలకు బలాన్నిస్తున్నాయి

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, వైఎస్ వివేకానందరెడ్డి మరణంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. వివేక రక్తపు మడుగులో పడివుండటం, తల, చేతిపై బలమైన గాయాలు ఉండటం ఈ అనుమానాలకు బలాన్నిస్తున్నాయి.

దీనిపై వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్ట్‌మార్టం నివేదిక వస్తే కానీ ఏం జరిగిందనేది ఒక నిర్థారణకు రాలేమని పోలీసులు భావిస్తున్నారు. గురువారం ఎన్నికల ప్రచారం ముగించుకుని రాత్రి ఇంటికి వచ్చిన ఆయన భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నారు.

ఇంట్లో ఆయన ఒక్కరే ఉన్నారు. శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో బాత్‌రూంలో వివేకానందరెడ్డి రక్తపు మడుగులో పడివుండటాన్ని పనివారు గుర్తించి పోలీసులకు, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఇయన ఇంటిని డాగ్‌స్వ్కాడ్ సాయంతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వివేకానందరెడ్డి పులివెందులలోని స్వగృహంలో శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. తాజాగా ఆయన మరణం వెనుక అనుమానాలు రావడంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.

తల, చేతిపై గాయాలు: వైఎస్ వివేకా మరణం వెనుక కుట్ర కోణం..?

నాడు జగన్‌తో విభేదాలు: విజయమ్మపై వైఎస్ వివేకా పోటీ

వివేకా బాత్‌రూం, బెడ్‌రూంలో రక్తపు మరకలు: కడప ఎస్పీ

వివేకానందరెడ్డి మరణంపై లోతైన దర్యాప్తు జరపాలి: విజయసాయి

వైఎస్ వివేకా మృతి.. లోకేష్ సంతాపం

నిన్న ప్రచారంలో వైఎస్ వివేకా: ఇంతలోనే ఇలా...

వైఎస్ వివేకానందరెడ్డి రాజకీయ ప్రస్థానం

click me!