నిన్న ప్రచారంలో వైఎస్ వివేకా: ఇంతలోనే ఇలా...

Published : Mar 15, 2019, 09:02 AM ISTUpdated : Mar 15, 2019, 11:59 AM IST
నిన్న ప్రచారంలో వైఎస్ వివేకా: ఇంతలోనే ఇలా...

సారాంశం

మాజీ మంత్రి, జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంతలోనే ఆయన గురించి విషాద వార్త వినాల్సి వచ్చిందని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్‌ వివేకానందరెడ్డి గొప్ప మానవతావాది అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. 

హైదరాబాద్‌: మాజీ మంత్రి, జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంతలోనే ఆయన గురించి విషాద వార్త వినాల్సి వచ్చిందని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్‌ వివేకానందరెడ్డి గొప్ప మానవతావాది అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. 

ఆర్భాటాలకు దూరంగా నిరాడంబరంగా ఉంటూ సామాన్యులకు అందుబాటులో ఉండేవారని తెలిపారు. తన తమ్ముడు చాలా సౌమ్యుడని వైఎస్‌ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. వివేకానందరెడ్డి మరణం చాలా బాధ కలిగించిందని అన్నారు.

1981లో తన తండ్రి సమితి ప్రెసిడెంట్‌గా సమయంలో ఆయన కూడా సమితి ప్రెసిడెంట్‌గా ఉన్నారని శ్రీకాంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. తమ రెండు కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని ఆయన తెలిపారు. 

2009లో తనకు ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇప్పించడంలో ఆయన పాత్ర కూడా ఉందన్నారు. బాబాయ్‌ అంటే వైఎస్‌ జగన్‌కు ఎంతో అభిమామని, ఈ విషాద వార్తను తట్టుకునే శక్తిని వైఎస్సార్‌ కుటుంబానికి భగవంతుడు ప్రసాదించాలని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

వైఎస్‌ వివేకానందరెడ్డి మరణం చాలా బాధాకరని కడప మేయర్‌ సురేశ్‌ అన్నారు. నిన్న కూడా చాపాడు మండలంలో తమతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈరోజు ఇలాంటి దుర్వార్త వినాల్సి రావడం దురదృష్టకరమన్నారు. 

20 ఏళ్లుగా కడప రాజకీయాల్లో తమకు చేదోడు వాడుగా నిలిచిన వివేకానందరెడ్డి హఠాన్మరణం చెందడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. ఆయన చాలా నిరాడంబరంగా ఉండేవారని, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి అని చెప్పారు.

సంబంధిత వార్తలు

బ్రేకింగ్: జగన్ బాబాయ్.. వైఎస్ వివేకా కన్నుమూత

నాడు జగన్‌తో విభేదాలు: విజయమ్మపై వైఎస్ వివేకా పోటీ

వైఎస్ వివేకానందరెడ్డి రాజకీయ ప్రస్థానం

పులివెందుల బయలుదేరిన జగన్, విజయమ్మ

PREV
click me!

Recommended Stories

Nara Lokesh Hilarious Comments On Varma | Asianet News Telugu
మండలిలో గోరెటి గర్జన | Goeti Venkanna Council Speech | Asianet News Telugu