పొలంలో కరెంట్ షాక్ వచ్చిన భార్యాపిల్లలను కాపాడి.. అదుతప్పి స్టార్టర్ బాక్స్ పై పడి ఎంపీటీసీ భర్త మృతి

Published : Jul 19, 2023, 07:42 AM IST
పొలంలో కరెంట్ షాక్ వచ్చిన భార్యాపిల్లలను కాపాడి.. అదుతప్పి స్టార్టర్ బాక్స్ పై పడి ఎంపీటీసీ భర్త మృతి

సారాంశం

కరెంటు షాక్ కు గురైన భార్య పిల్లలను ఓ భర్త కాపాడాడు. కానీ ఆయన బ్యాలెన్స్ తప్పి స్టార్టర్ బాక్స్ పై పడిపోయాడు. దీంతో ఆయన కరెంట్ షాక్ కు గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో జరిగింది.

కరెంట్ షాక్ వచ్చిన భార్యాపిల్లలను కాపాడి, అనంతరం భర్త కూడా అదే ప్రమాదానికి గురై ప్రాణాలొదిలాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా శింగనమల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నార్పాల అనే గ్రామంలో 40 ఏళ్ల బాలకృష్ణ తన భార్యా, పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. ఆయన భార్య భాగ్యలక్షి నార్పల-4 ఎంపీటీసీ సభ్యురాలిగా సేవలు అందిస్తున్నారు. 

ఒంగోలులో గిరిజనుడిపై దారుణం.. చితకబాది, నోట్లో మూత్రం పోసి, మర్మాంగాన్ని నోట్లో పెట్టుకోవాలని ఒత్తిడి.. వీడియో

అయితే ఈ కుటుంబం గ్రామ సమీపంలో ఉన్న వారి వ్యవసాయ భూమిలో పలు రకాల పంటలు సాగు చేస్తూ జీవిస్తోంది. ఈ క్రమంలో ఎప్పటిలాగే బాలకృష్ణ మంగళవారం కుడా తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. అక్కడ మొక్కజొన్న పంటకు పురుగు మందులు స్ప్రే చేయాలని భావించారు. ఆయన వెంట భార్య, పిల్లలు కూడా చేన్లోకి వచ్చారు. అయితే నీళ్ల కోసం బోర్ మోటర్ స్విచ్ ఆన్ చేయాలని ఆయన భార్యకు సూచించారు. 

మహిళతో బీజేపీ నేత కిరీట్ సోమయ్య న్యూడ్ వీడియో కాల్.. వైరల్.. ప్రతిపక్షాల విమర్శలు

దీంతో ఆమె తన పిల్లలతో కలిసి స్టార్టర్ బాక్స్ వద్దకు వెళ్లింది. అనంతరం బటన్ వేయాలని ప్రయత్నించగా ఒక్క సారిగా ఆమెకు కరెంట్ షాక్ వచ్చింది. ఆమెతో పాటు పిల్లలు కూడా కరెంట్ షాక్ కు గురయ్యారు. దీనిని గమనించిన భర్త అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. తన లుంగీతో ముగ్గురినీ పక్కకు లాగి, కాపాడారు. భార్యా పిల్లలను కాపాడే క్రమంలో ఆయన బ్యాలెన్స్ తప్పి స్టార్టర్ బాక్స్ పై పడిపోయాడు. దీంతో ఆయనకూ కరెంట్ షాక్ వచ్చింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడే చనిపోయారు. 

వార్నీ.. ప్రియురాలిని చీకట్లో కలిసేందుకు ఊరు మొత్తానికే కరెంట్ కట్ చేసిన ప్రియుడు.. ఇద్దరూ సన్నిహితంగా ఉండగా..

ఈ ఘటనలో భార్య, ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలు అయ్యాయి. తమని కాపాడి, మీరు ప్రమాదానికి గురై, ప్రాణాలు ఒదిలారా అంటూ కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ దృశ్యం అందరినీ కంటతడి పెట్టేలా చేసింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. 
 

PREV
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu