ప్రభుత్వ వ్యతిరేకతను చీల్చడం జనసేన విధానం కాదు.. : పవన్ కళ్యాణ్

Published : Jul 19, 2023, 04:40 AM IST
ప్రభుత్వ వ్యతిరేకతను చీల్చడం జనసేన విధానం కాదు.. : పవన్ కళ్యాణ్

సారాంశం

Amaravati: ఆంధ్రప్రదేశ్ సుస్థిరతకు బీజేపీ, టీడీపీ, జనసేనలతో కూడిన పాత ఎన్డీయే కూటమి అవసరమని పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు సుస్థిరత అవసరమనీ, అది ఇప్పుడు లేదని... వైసీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్రం ఆర్థికంగా చితికిపోతోందన్నారు. రాష్ట్రానికి సుస్థిరత కల్పించడమే తన లక్ష్యమనీ, అందుకోసం 2014లో ఎన్డీయేలోని మూడు మిత్రపక్షాలైన బీజేపీ, టీడీపీ, జనసేనలు మళ్లీ ఒక్కటవ్వాలని ఆశిస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ తెలిపారు.  

Jana Sena President Pawan Kalyan: ప్రభుత్వ వ్యతిరేకతను చీల్చడం జనసేన విధానం కాదని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ సుస్థిరతకు బీజేపీ, టీడీపీ, జనసేనలతో కూడిన పాత ఎన్డీయే కూటమి అవసరమని  ఉద్ఘాటించారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు సుస్థిరత అవసరమనీ, అది ఇప్పుడు లేదని... వైసీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్రం ఆర్థికంగా చితికిపోతోందన్నారు. రాష్ట్రానికి సుస్థిరత కల్పించడమే తన లక్ష్యమనీ, అందుకోసం 2014లో ఎన్డీయేలోని మూడు మిత్రపక్షాలైన బీజేపీ, టీడీపీ, జనసేనలు మళ్లీ ఒక్కటవ్వాలని ఆశిస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లో పొత్తులపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్డీయే మిత్రపక్షాల సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయన.. వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చకుండా జనసేన విధానం అవసరమని నొక్కి చెప్పారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమితో కలిసి జనసేన పోటీ చేసిందన్నారు. టీడీపీ, బీజేపీల‌ మధ్య అవగాహన సమస్యను అంగీకరిస్తూనే, వారు ఇంకా కలిసి పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో పవన్ స్పందిస్తూ.. అది సమస్య కాదనీ, జనసేన క్యాడర్ తనను సీఎంగా చూడాలని కోరుకుంటోందని అన్నారు. క్షేత్ర స్థాయిలో బలాబలాల ఆధారంగా సీఎం అభ్యర్థి విషయంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. వైసీపీని ఓడించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని పవన్ స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో నెలకు రూ.5 వేల జీతంతో రిక్రూట్ అయిన ప్ర‌యివేటు వ్యక్తులు డేటాను సేకరిస్తున్నారనీ, ఆధార్ వంటి వ్యక్తిగత డేటాను అందించాల్సిన అవసరం ఏమిటని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆధార్, బ్యాంకు ఖాతాలు వంటి సున్నితమైన డేటాను తెలంగాణలో భద్రపరుస్తున్నారని, దీనివల్ల రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. అసంపూర్తిగా ఉన్న మౌలిక సదుపాయాలు, రైతులకు మద్దతు ధర లేకపోవడం, ఉద్యోగులకు సక్రమంగా జీతాలు ఇవ్వకపోవడం వంటి సమస్యలను జనసేన పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. తమ ప్రయత్నాలకు ప్రజల మద్దతు ఉందని ఆయన పేర్కొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu