చలి చంపేస్తోంది.. తెలుగురాష్రాల్లో 34 మంది మృతి

By sivanagaprasad kodatiFirst Published Dec 19, 2018, 7:58 AM IST
Highlights

పెథాయ్ తుఫాను దెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా అన్ని చోట్లా రాత్రి ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. మూడు రోజుల నుంచి వీస్తున్న ఈదురు గాలులకు తోడు.. ఉత్తరాది నుంచి మధ్యభారతం మీదుగా చలిగాలులు వ్యాపించి ఉన్నాయి. దీంతో ఏపీ, తెలంగాణల్లో ఉత్తరాది తరహా వాతావరణం నెలకొంది. 

చలి తీవ్రతకు రెండు రాష్ట్రాల్లో 34 మంది మరణించారు. ఏపీలో 23 మంది, తెలంగాణలో 11 మంది మరణించారు. విశాఖ జిల్లాల్లో అత్యధికంగా ఆరుగురు, ప్రకాశం జిల్లాలో ఐదుగురు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో ముగ్గురు, విజయనగరంలో ఇద్దరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు చనిపోయారు.

ఇక తెలంగాణ విషయానికి వస్తే అక్కడ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. రాజధాని హైదరాబాద్‌లో మంగళవారం 19.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది పగటి సమయంలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదే కావడం గమనార్హం.

తుఫాను వల్ల బంగాళాఖాతం నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన తేమ గాలులు వీయడానికి తోడు, ఉత్తరాది శీతలగాలుల వల్ల రెండు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం నుంచి పగటి ఉష్ణోగ్రతలు పెరిగి.. రాత్రిపూట చలి అధికమవుతుందని అధికారులు వెల్లడించారు. 

పెథాయ్ సహాయక చర్యలపై డాక్యుమెంటరీ: అధికారులకు చంద్రబాబు ఆదేశం

తీరం దాటిన పెథాయ్, చంద్రబాబు సమీక్ష

పెథాయ్ తుపాను దాటికి ఆరుగురు మృతి....

ఎన్టీఆర్ పై పెథాయ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్!

తీరం దాటిన పెథాయ్ తుఫాన్.. తూర్పుగోదావరిలో బీభత్సం

పెథాయ్ పవర్‌ ‘‘కోనసీమ’’ మీదనేనా..?

తుఫానుకు ‘‘పెథాయ్’’ అన్న పేరు వెనుక..?

‘‘పెథాయ్’’ ఎఫెక్ట్: ఏపీలో వర్షం, తెలంగాణలో చలి

click me!