ఏపీలో తమిళనాడు సీన్ రిపీట్ అవుతోంది.. మంత్రి నారాయణ

Published : Oct 05, 2018, 02:19 PM IST
ఏపీలో తమిళనాడు సీన్ రిపీట్ అవుతోంది.. మంత్రి నారాయణ

సారాంశం

తమిళనాడు లో కూడా నేతల పై ఐటీ దాడులు చేయించి వారిని భయభ్రాంతులకు గురి చేసి చివరకు  తమకు కావాల్సిన వారిని ముఖ్యమంత్రి చేశారని గుర్తు చేశారు.

ఏపీలో ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే తమిళనాడు సీన్ రిపీట్ అవుతోందనిపిస్తోందని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. గురువారం సాయంత్రం నుంచి  ఏపీలో ఐటీ దాడులు కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై మంత్రి నారాయణ స్పందించారు. నారాయణకు సంబంధించిన నారాయణ విద్యా సంస్థల్లోనూ దాడులు జరిగాయని ఉదయం ప్రచారం జరిగింది. కాగా..దీనిపై కూడా మంత్రి వివరణ ఇచ్చారు.

టీడీపీపై కక్ష సాధించడానికి ఐటీ దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం మా పై ఐటీ దాడులు చేయించి మమ్మల్ని  భయ బ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.  తమిళనాడు లో కూడా నేతల పై ఐటీ దాడులు చేయించి వారిని భయభ్రాంతులకు గురి చేసి చివరకు  తమకు కావాల్సిన వారిని ముఖ్యమంత్రి చేశారని గుర్తు చేశారు.

  అలాగే కర్ణాటకలో కూడా అదే పరిస్థితి నెలకొందన్నారు.  ఆంధ్రప్రదేశ్ లో  తెలుగుదేశం పార్టీ నేతల పై ఐటీ దాడులు చేయించి భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తోందన్నారు.  ఇలాంటి కక్షసాధింపు చర్యలు చేస్తే ప్రజలు గట్టి బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.  బాబ్లీ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు కోర్టు నోటీసులు అందజేసి హాజరు కావాలని చెప్పడం కేంద్ర ప్రభుత్వం కుట్ర కాదా   అని ఆయన ప్రశ్నించారు.

 ఇంతటితో కక్షసాధింపు చర్యలు ఆపకపోతే ఊరుకునేది లేదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజా బలం ఉందని ప్రజల నుంచి బిజెపి కి ఎలాంటి తీర్పు వస్తుందోనని వచ్చే ఎన్నికల్లో తెలుస్తోంది అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పోతుగంటి అలేఖ్య, కమిషనర్ వెంకటేశ్వర్లు,  జిల్లా సహకార బ్యాంకు డైరెక్టర్ దామీశెట్టి సుదీర్ నాయుడు, పట్టణ టిడిపి అధ్యక్షులు అమర యాదగిరి గుప్తా, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబు రావు, పలువురు టీడీపీ నాయకులు అధికారులు తదితరులు ఉన్నారు.

read more news

ఏపీలో ఐటీ దాడులు... దీని వెనక మరో కోణం..?

ఐటీ అధికారుల చేతిలో.. ఓ మంత్రికి చెందిన ఫైల్..?

ఎన్నికలకు ముందు.. ఇలా చేయడం బీజేపీకి అలవాటే..చంద్రబాబు

ఐటీ దాడులపై మంత్రి నారాయణ స్పందన

బెజవాడలో ఐటీ దాడులు.. నారాయణ కాలేజీ దాకా వెళ్లి మధ్యలో వచ్చేసిన అధికారులు

టీడీపీ నేతలపై ఐటీ గురి.. నెల్లూరులో బీద మస్తాన్ రావు ఇంటిలో సోదాలు

బెజవాడలో ఐటీ దాడుల కలకలం.. టీడీపీ నేతల ఇళ్లపై దాడులకు పక్కా వ్యూహం..?

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్