ఏపీలో ఐటీ దాడులు... దీని వెనక మరో కోణం..?

By ramya neerukondaFirst Published Oct 5, 2018, 1:51 PM IST
Highlights

అక్రమ లావాదేవీలు, అవినీతి వ్యవహారాలు, సూట్‌కేస్ కంపెనీలు, పెట్టుబడుల అంశాలను దృష్టిలో ఉంచుకుని ఐటీ శాఖ ఈ దాడులను నిర్వహించినట్లు తెలిసింది. 

ఏపీలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. గురువారం సాయంత్రం నుంచి ఇప్పటి వరకు 28 చోట్ల ఐటీ అధికారులు సోదాలు జరిపారు. టీడీపీ ని లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు చేస్తున్నారని ఇఫ్పటికే ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.  అయితే.. ఈ దాడులు జరపడంలో అధికారులు రెండు ప్లాన్లను అనుసరించారని తెలుస్తోంది.

గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం నగరాలతో పాటు హైదరాబాద్‌లో కూడా ఐటీ శాఖ దాడులు జరిగాయి. వీఎస్ లాజిస్టిక్స్, స్వగృహ, సదరన్ కన్‌స్ట్రక్షన్స్‌తో సహా పలు కంపెనీల్లో ఈ దాడులు జరిపినట్లు సమాచారం. అక్రమ లావాదేవీలు, అవినీతి వ్యవహారాలు, సూట్‌కేస్ కంపెనీలు, పెట్టుబడుల అంశాలను దృష్టిలో ఉంచుకుని ఐటీ శాఖ ఈ దాడులను నిర్వహించినట్లు తెలిసింది. 

పలు సంస్థలకు సంబంధించిన యాజమాన్యాల పెద్దలను ఐటీ ప్రశ్నించింది. ఈరోజు సాయంత్రం వరకూ ఐటీ దాడులు కొనసాగే అవకాశమున్నట్లు తెలిసింది. అయితే ఈ ఐటీ దాడుల వెనుక కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఐటీ దాడుల గురించి మీడియాకు ప్రత్యక్షంగా సమాచారం అందటంతో అధికారులు ప్లాన్ బీని అమలు చేశారు. మొదట బెంజిసర్కిల్‌లోని నారాయణ కాలేజికి వెళ్లిన ఐటీ బృందం.. అక్కడ మీడియా ఉండటంతో అక్కడి నుంచి బందర్ రోడ్డుకు వెళ్లిపోయారు. తమను వెంబడించవద్దని మధ్యాహ్నం తర్వాత తామే వివరాలు వెల్లడిస్తామని ఐటీ అధికారులు చెప్పారు.
 
జగ్గయ్యపేట దగ్గరలోని ప్రీకాస్ట్ ఇటుకల పరిశ్రమపై ఐటీ దాడులు చేసింది. మీడియా ఉండటంతో ప్లాన్ ఏ అమలు చేయలేకపోయారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆరు బృందాలు వెనక్కి తిరిగి వచ్చాయని టీడీపీ నేతలకు సమాచారం అందినట్లు తెలిసింది. రెండుమూడు రోజుల్లో టీడీపీ నేతలు, అనుచరులకు చెందిన ఆస్తులు, ఆఫీసులపై ఐటీ దాడులు జరుగుతాయని అధికార పార్టీకి సమాచారం అందడంతో నేతలతో చంద్రబాబు సంప్రదింపులు జరిపారు.

read more news

ఐటీ అధికారుల చేతిలో.. ఓ మంత్రికి చెందిన ఫైల్..?

ఎన్నికలకు ముందు.. ఇలా చేయడం బీజేపీకి అలవాటే..చంద్రబాబు

ఐటీ దాడులపై మంత్రి నారాయణ స్పందన

బెజవాడలో ఐటీ దాడులు.. నారాయణ కాలేజీ దాకా వెళ్లి మధ్యలో వచ్చేసిన అధికారులు

టీడీపీ నేతలపై ఐటీ గురి.. నెల్లూరులో బీద మస్తాన్ రావు ఇంటిలో సోదాలు

బెజవాడలో ఐటీ దాడుల కలకలం.. టీడీపీ నేతల ఇళ్లపై దాడులకు పక్కా వ్యూహం..?

click me!