
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ, గీతం యూనివర్సిటీ వ్యవస్థాపకులు ఎంవీవీఎస్ మూర్తి భౌతిక కాయం ఆదివారం విశాఖకు చేరుకునే అవకాశం ఉందని కుటుంబసభ్యులు భావిస్తున్నారు.
ప్రమాదం జరిగిన రోజే మూర్తి మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి అలస్కా స్టేట్ మెడికల్ ఎగ్జామినేషన్ సెంటర్‌లో ఉంచారు. నిన్న ఉదయం మూర్తి మనవడు భరద్వాజ్ అలస్కా స్టేట్ ఆస్పత్రికి చేరుకున్నారు.
అనంతరం మూర్తితో పాటు మరణించిన మిగిలిన వారి మృతదేహాలను స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన అధికారిక పత్రాలను అధికారులకు అందజేశారు. మిగిలిన వ్యవహారాలు పూర్తయిన తర్వాత మూర్తి, చౌదరి, శివప్రసాద్, బసవపున్నయ్య మృతదేహాలను స్వాధీనం చేసుకుని శాన్‌ఫ్రాన్సిస్కోకు తరలించనున్నారు.
అక్కడి నుంచి నేరుగా ఎయిర్‌ఇండియా విమానం ద్వారా మృతదేహాలను భారత్‌కు తీసుకురానున్నారు. మూర్తి మృతదేహం విశాఖ చేరుకున్న తర్వాత కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం ఉంచి.. సోమవారం అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉందని కుటుంబసభ్యులు తెలిపారు.
అమెరికాలోని ప్రఖ్యాత వైల్డ్ లైఫ్ సఫారీని సందర్శించేందుకు ఎంవీవీఎస్ మూర్తితోపాటు వీపీఆర్ చౌదరి, వీరమాచనేని శివప్రసాద్, వెలువోలు బసవపున్నయ్య, కడియాల వెంకట్ కారులో లాస్ ఏంజెల్స్ నుంచి బయలుదేరారు.
ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మూర్తితో పాటు వాహనంలో ప్రయాణిస్తూ ప్రమాదంలో మరణించిన వీపీఆర్ చౌదరి అలియాస్ చిన్నా, వీరమాచనేని శివప్రసాద్, వెలువోలు బసవపున్నయ్య మరణించగా.. కడియాల వెంకట్ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. టీడీపీ నేత, ‘గీతం’ అధినేత ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం
ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం: విశాఖ బయలు దేరిన గంటా
ఎంవీవీఎస్ మూర్తి మరణం.. రోడ్డు ప్రమాదాల్లోనే నేతలను కోల్పోతున్నాం: చంద్రబాబు ఆవేదన
మూర్తిగారిని మొన్ననే మండలి సమావేశాల్లో చూశా.. ఇంతలోనే: నారా లోకేశ్
మూర్తి మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి.. ఏర్పాట్లను సమీక్షిస్తున్న తానా
అమెరికాలో మృతి: ఆయన గోల్డ్ స్పాట్ మూర్తి ఎలా అయ్యారంటే...