వంగవీటి రాధ హత్యకు రెక్కీ... వైసిపి కుట్రేనా?: జనసేన నేత పోతిన మహేష్ సంచలనం

Arun Kumar P   | Asianet News
Published : Dec 30, 2021, 02:45 PM IST
వంగవీటి రాధ హత్యకు రెక్కీ... వైసిపి కుట్రేనా?: జనసేన నేత పోతిన మహేష్ సంచలనం

సారాంశం

టిడిపి నాయకుడు వంగవీటి రాధ తనకు ప్రాణహాని వుందంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలను హీటెక్కించాయి. తాజాగా జనసేన పార్టీ నాయకుడు పోతిన మహేష్ ఈ వ్యాఖ్యలపై స్పందించాడు.  

విజయవాడ: తన హత్యకు కుట్ర జరుగుతోందని టిడిపి నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ (vangaveeti radha) వ్యాఖ్యలు బెజవాడ రాజకీయాలను వేడెక్కించాయి. ఇటీవల తన తండ్రి వంగవీటి మోహనరంగ వర్థంతి (vangaveeti raga vardanthi) కార్యక్రమంలో రాధ తనకు ప్రాణహాని వుందని... చంపడానికి రెక్కీ నిర్వహించారంటూ ఆందోళన వ్యక్తం చేసారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా జనసేన పార్టీ (janasena party) విజయవాడ అధ్యక్షుడు పోతిన మహేష్ (pothina mahesh) స్పందించారు. 

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా హత్యకు రెక్కీ నిర్వహించడం దురదృష్టకరమని మహేష్ అన్నారు. ఇది పూర్తిగా వైసిపి ప్రభుత్వ (ysrcp government) వైఫల్యమేనని పేర్కొన్నారు. ప్రజల్లో విధ్వంసాలను రెచ్చగొట్టే విధంగా కుట్రలు చేస్తోందా అనేలా ప్రభుత్వ తీరు ఉందని ఆరోపించారు. వంగవీటి రాధా వ్యాఖ్యలు, హత్యకు రెక్కీ నిర్వహించడంపై రాష్ట్ర డీజీపీ (ap dgp) గౌతమ్ సవాంగ్ (goutham sawang) పూర్తిస్థాయి దర్యాప్తు చేయించాలని...దీని వెనక ఎవరున్నా విడిచిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోతిన మహేష్ డిమాండ్ చేసారు. 

read more  హత్యకు రెక్కీ.. హీటెక్కిన బెజవాడ, రాజకీయమంతా ‘‘ వంగవీటి రాధా’’ చుట్టూనే

ఇక జనసేన పార్టీ గురించి మహేష్ మాట్లాడుతూ...ఈ ఏడాది మొత్తం జనసైనికులు, వీర మహిళలు ప్రజల కోసమే పనిచేసారన్నారు. దివీస్ పరిశ్రమ మొదలుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య వరకూ ప్రజల పక్షాన జనసేన పోరాడిందని గుర్తుచేసారు. ఇదే స్ఫూర్తిని 2024 వరకూ కొనసాగించి రాజ్యాధికారం దిశగా కృషి చేస్తామని మహేష్ ధీమా వ్యక్తం చేసారు.  

''అధికార వైసీపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీని బయటకు రాకుండా ఇబ్బంది పెడుతోంది. కానీ వైసిపి ప్రభుత్వానికి బయపడకుండా జనసేన మాత్రమే ప్రజల్లో ఉంది. జనసేన తరఫున లక్ష మందికి పైగా స్థానిక సంస్థల్లో పోటీ చేసి 25 శాతానికి పైగా ఓట్లు కొల్లగొట్టారు'' అని పోతిన మహేష్ తెలిపారు.

''రాష్ట్రంలో 8 జిల్లాల్లోని 100కు పైగా నియోజకవర్గాలలో మండల అధ్యక్షులను ఇప్పటికే జనసేన నియమించింది. ఇలా పార్టీ బలంగా ప్రజల్లోకి వెళ్తోంది. విజయవాడలో ఉన్న 64 డివిజన్లలో 58 డివిజన్లకు అధ్యక్షులను నియమించాం. బిసి, ఎస్సి, ఎస్టి, మైనార్టీ, మహిళలలకే 65 శాతం సీట్లు కేటాయించాము. అందులో 24మంది ఉన్నత చదువులు చదివిన వారు ఉన్నారు. చిత్తశుద్ధితో పనిచేసే వారికే అవకాశం కల్పించాం'' అని వివరించారు. 

read more  రాధా హత్యకు రెక్కీ: పోలీసుల అదుపులో దేవినేని రైట్ హ్యాండ్ అరవ సత్యం .. స్పృహ తప్పడంతో ఆసుపత్రికి

''విజయవాడ నగర పరిధిలో టీడ్కో ఇల్లు, సెంటు భూమి ఇల్లు, చెత్తపన్ను, ఓటీఎస్ వంటి అంశాలపై రాబోయే సంవత్సరంలో ప్రజల తరఫున పోరాడతాం. వైసీపీ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత నగరంలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు. పన్నులు పెంచితే ఒక్క కార్పొరేటర్ కూడా నోరు మెదపలేదు. జనసేన ప్రతి ప్రజా సమస్యపైనా పోరాడుతోంది. ప్రజలు దీన్ని గమనించాలి'' అని జనసేన నాయకులు పోతిన మహేష్ పేర్కొన్నారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు