సినిమా టికెట్ ధరల వివాదం: రేపు ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్‌తో ప్రభుత్వ కమిటీ జూమ్ మీటింగ్

Siva Kodati |  
Published : Dec 30, 2021, 02:23 PM ISTUpdated : Dec 30, 2021, 02:25 PM IST
సినిమా టికెట్ ధరల వివాదం: రేపు ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్‌తో ప్రభుత్వ కమిటీ జూమ్ మీటింగ్

సారాంశం

సినిమా టికెట్ ధరల తగ్గింపుతో పాటు థియేటర్ల వివాదంపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ రేపు భేటీ కానుంది. శుక్రవారం ఉదయం 11.45 గంటలకు జూమ్‌లో భేటీకానున్నారు సభ్యులు. హోంశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ కన్వీనర్‌గా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు , ఛాంబర్ ప్రతినిధులు, సినీ గోయర్స్‌తో కమిటీ ఏర్పాటైంది. 

సినిమా టికెట్ ధరల తగ్గింపుతో పాటు థియేటర్ల వివాదంపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ రేపు భేటీ కానుంది. శుక్రవారం ఉదయం 11.45 గంటలకు జూమ్‌లో భేటీకానున్నారు సభ్యులు. హోంశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ కన్వీనర్‌గా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు , ఛాంబర్ ప్రతినిధులు, సినీ గోయర్స్‌తో కమిటీ ఏర్పాటైంది. జీవో 35 ప్రకారం టికెట్ల ధరలు తమకు గిట్టుబాటు కావంటున్న సినీ పరిశ్రమ విజ్ఞప్తిపై హైకోర్టు ఆదేశాలతో ఈ కమిటీ ఏర్పాటైంది. 13 మంది సభ్యులు కమిటీ రేపు తొలిసారిగా భేటీకానుంది. 

మరోవైపు Andhra pradesh రాష్ట్రంలో Cinema థియేటర్ల ఓనర్లకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం శుభవార్త తెలిపింది. సీజ్ చేసిన Theatres ఓపెన్ చేసుకొనేందుకు అనుమతిని ఇచ్చింది.ప్రభుత్వం ఆదేశించిన నిబంధనల మేరకు నెల రోజుల్లో అన్ని వసతులను కల్పించాలని ప్రభుత్వం థియేటర్ల ఓనర్లకు సూచించింది. ఏపీ రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లోని 83 థియేటర్లను రాష్ట్ర ప్రభుత్వం సీజ్ చేసింది.

Also Read:జగన్ సర్కార్ గుడ్‌న్యూస్: సీజ్ చేసిన సినిమా థియేటర్ల రీ ఓపెనింగ్‌కి అనుమతి

రాష్ట్రంలోని 9 జిల్లాల్లో సుమారు 83 థియేటర్లను సీజ్ చేశారు. అయితే పలు రకాల కారణాలతో ఈ థియేటర్లను సీజ్ చేశారు.. ప్రభుత్వం సూచించినట్టుగా వసతులను సినిమా థియేటర్లలో కల్పించలేదు. దీంతో ప్రభుత్వం సినిమా థియేటర్ల యజమానులకు సవయం ఇచ్చింది. అయినా వారిలో మార్పు రాకపోవడంతో సినిమా థియేటర్లలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో వసతులు లేని సినిమా థియేటర్లను అధికారులు సీజ్ చేశారు.

అయితే కొన్ని సినిమా థియేటర్లకు లైసెన్సులు కూడా రెన్యూవల్ చేసుకోలేదని ప్రభుత్వం గుర్తించింది.  రెండు రోజుల క్రితం కృష్ణా జిల్లాకు చెందిన సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు  ఏపీ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్నినానితో సమావేశమయ్యారు. తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సినిమా టికెట్ల ధరలను పెంచుకొనేందుకు అవకాశం ఇవ్వాలని కూడా కోరారు.


 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?