బ్రహ్మదేవుడు కూడా సీఎం జగన్‌ను జైలుకు పంపించలేడు.. డిప్యూటీ సీఎం నారాయణస్వామి

Published : Dec 30, 2021, 02:26 PM IST
బ్రహ్మదేవుడు కూడా సీఎం జగన్‌ను జైలుకు పంపించలేడు.. డిప్యూటీ సీఎం నారాయణస్వామి

సారాంశం

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి (narayana swamy ) బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తక్కువ ధరకే చీప్‌లిక్కర్ ఇస్తామని చేసిన వ్యాఖ్యాలను తప్పు బట్టారు. ఎవరెన్ని కుట్రలు చేసిన సీఎం జగన్‌కు (ys jagan) భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయని అన్నారు. 

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి (narayana swamy ) బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తక్కువ ధరకే చీప్‌లిక్కర్ ఇస్తామని చేసిన వ్యాఖ్యాలను తప్పు బట్టారు. ఎవరెన్ని కుట్రలు చేసిన సీఎం జగన్‌కు (ys jagan) భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయని అన్నారు. గురువారం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో డిప్యూటీ సీఎంలునారాయణ స్వామి, ఆళ్ల నాని స్వామి వారి సేవలో పాల్గొన్నారు. తిరుమలకు (tirumala) చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. 

దర్శనం అనంతరం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ.. సోము వీర్రాజును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎందుకు చేసిందో అర్థం కావడం లేదన్నారు. చీప్‌లిక్కర్ రూ. 50 ఇచ్చి ప్రజలను సంతోషపెడతానని సోము వీర్రాజు చెప్పడం చూస్తే.. ఆయన వ్యక్తిత్వం ఎట్లుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. సారాయి ఇచ్చి ఎవరైన ఓట్లు అడుగుతారా అని ప్రశ్నించారు. తాగుబోతులకు ఆయన అధ్యక్షుడు అయ్యాడెమో తెలియడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మతాన్ని రెచ్చగొట్టేలా బీజపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. 

Also read: ‘టాలీవుడ్‌లో 3 కుటుంబాలదే అధిపత్యం.. సినీ పరిశ్రమలో వారసత్వ రాజ్యం’.. ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

సీఎం జగన్‌పై అనవసరంగా బురద జల్లుతున్నారని.. ఆయన ఎలాంటి చిన్న తప్పు కూడా చేయ లేదని నారాయణ స్వామి చెప్పారు. సీఎం జగన్ సింహం అని.. ఎంతమంది వచ్చినా ఒంటరిగానే పోరాడతారని పేర్కొన్నారు. జగన్‌ని జైలుకు పంపడం ఎవరి తరం కాదని.. శ్రీవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. ఆయనను బ్రహ్మదేవుడు కూడా జైలుకు పంపించలేడని అన్నారు.

ఇదిలా ఉంటే బుధవారం ఏపీలో సినిమా టికెట్ల ధరలు, సినిమా పరిశ్రమపై నారాయణ స్వామి (narayana swamy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు  సినీ పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా పరిశ్రమ మూడు కుటుంబాల్లో చేతుల్లో ఉందని అన్నారు. సినీ పరిశ్రమలో 3 కుటుంబాల అధిపత్యమే కొనసాగుతుందని విమర్శించారు. పేదవాళ్లు కూడా సినిమా చూడాలనే ఉద్దేశంతోనే సీఎం జగన్ చర్యలు తీసుకున్నారని చెప్పారు. సినిమాలు ఆడకకుండా నిర్మాతలు నష్టపోయినప్పుడు హీరోలు ఆదుకోలేదని ఆరోపించారు. రాజకీయాల్లోనే కాదు సినీ పరిశ్రమలోనూ వారసత్వ రాజ్యం కొనసాగుతుందని అన్నారు. హీరోల గురించి ఎక్కువ మాట్లాడితే తనను ఓడించే ప్రయత్నం చేస్తారేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టికెట్ల ధరలపై కమిటీ నిర్ణయం ప్రకారమే తదుపరి చర్యలు ఉంటాయని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?