నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం  

By Rajesh KarampooriFirst Published Mar 28, 2024, 12:12 AM IST
Highlights

 Kiran Kumar Reddy Biography: నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పేరు. ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో ములుపులు. తన తండ్రి అమర్నాథ్ రెడ్డి ఆకస్మిక మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన  అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఓ సాధారణ కార్యకర్త నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ, ఊహించని విధంగా పరాజయం పాలై దాదాపు దశాబ్ద కాలం క్రియశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల బీజేపీలో చేరిన ఆయన ప్రస్తుతం పార్లమెంట్ బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వ్యక్తిగత, రాజకీయ ప్రస్తానం మీకోసం.. 

Kiran Kumar Reddy Biography: నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పేరు. ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో ములుపులు. తన తండ్రి అమర్నాథ్ రెడ్డి ఆకస్మిక మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన  అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఓ సాధారణ కార్యకర్త నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ, ఊహించని విధంగా పరాజయం పాలై దాదాపు దశాబ్ద కాలం క్రియశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల బీజేపీలో చేరిన ఆయన ప్రస్తుతం పార్లమెంట్ బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వ్యక్తిగత, రాజకీయ ప్రస్తానం మీకోసం.. 

బాల్యం, విద్యాభ్యాసం 

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. 1960 సెప్టెంబర్ 13న నల్లారి అమర్ నాథ్ రెడ్డి - సరోజనమ్మ దంపతులకు హైదరాబాదులో జన్మించాడు.  ఆయనకు ఇద్దరు తమ్ముళ్లు, ఒక చెల్లెలు. కిరణ్ కుమార్ గారిది చిత్తూరు జిల్లా కలికిరి మండలం నగిరిపల్లి అనే చిన్న గ్రామం. కానీ, కిరణ్ కుమార్ కుటుంబం హైదరాబాదులో స్థిరపడింది. దీంతో కిరణ్ కుమార్ ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య  హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పూర్తి చేశారు. ఆ తరువాత జోసెఫ్ జూనియర్ కాలేజీలో ఇంటర్, నిజం కాలేజీలో చేరి బీకాం డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్.ఎల్.బి పూర్తి చేశారు. 

ప్రారంభ జీవితం 

కిరణ కూమార్ కు క్రికెట్ అంటే ప్రాణం. రోజుకి , దాదాపు 7 గంటలు ప్రాక్టీస్ చేసేవారు. ఆయన అండర్ 19, అండర్ 22, అండర్ 25లో సౌత్ జోన్ తరపున కెప్టెన్ గా ఆడారు. సౌత్ జోన్ విశ్వవిద్యాలయాలు , ఉస్మానియా విశ్వవిద్యాలయ క్రికెట్ జట్లకు కూడా కెప్టెన్‌గా వ్యవహరించారు. మాజీ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌, కిరణ్ కూమార్ రెడ్డి, సురేష్ రెడ్డి ,మధుయాష్కి,మహేంద్ర రెడ్డిలు క్లాస్మేట్స్. నందమూరి బాలకృష్ణ కూడా కిరణకుమార్ రెడ్డి టీం లో ఆడేవారు. ఇదిలా ఉంటే.. 1983 నాటికి తండ్రి అమర్నాథరెడ్డి ఆరోగ్యం దెబ్బతినడంతో ఎలాంటి ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండానే తండ్రికి చేదోడు వాదోడుగా ఉన్నారు. ఆ సమయంలోనే కిరణ్ కుమార్ కి రమణారెడ్డి గారి అమ్మాయి రాధికా రెడ్డి గారిని ఇచ్చి వివాహం చేశారు.

రాజకీయ జీవితం 

కిరణ్ కుమార్ తండ్రి అమర్ నాథ్ రెడ్డి 1987లో మరణించారు. ఆయన మరణంతో 1988లో వాయలపాడు నియోజకవర్గానికి ఉపఎన్నిక వచ్చింది. దాంతో ఆ ఎన్నికల్లో కిరణ్ కుమార్ అమ్మ సరోజమ్మ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే.. ఆ ఎన్నికల్లో సరోజమ్మ టిడిపి అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత సంవత్సరమే(1999) సాధారణ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో అమర్నాథరెడ్డి తరఫున ఆయన బామ్మర్ది నిలబడాలని కొందరూ భావించారు. కానీ ఆ నిర్ణయం  కాంగ్రెస్ కార్యకర్తలు, అమర్నాథ రెడ్డి అనుచరులు నచ్చలేదు. తన నాయకుడు అమర్నాథరెడ్డి గారి వారసుడిగా కిరణ్ కుమార్ రాజకీయాల్లోకి రావాలని డిమాండ్ చేశారు. 

ఇలా తప్పనిసరి పరిస్థితుల్లో కిరణ్ కుమార్ 1989 ఎన్నికల సమయంలో రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఈ ఎన్నికల్లో గెలుపొందడంతో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ సమయంలో ఆయన పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ, అస్యూరెన్స్ కమిటీ సభ్యునిగా పనిచేశాడు. కానీ, 1994 ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో ఆయన తొలిసారి ఓటమి పాలయ్యారు. 1994 లో భారీ తేడాతో ఓటమి చవిచూచినా.. 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించారు కిరణ్ కుమార్. 2004లో వై. ఎస్.రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర నాయకత్వ పగ్గాలు చేపట్టిన తర్వాతే ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఎన్నికైన కిరణ్ కుమార్ రాష్ట్ర మీడియా దృష్టిని ఆకర్షించారు. అలాగే.. వైఎస్ఆర్‌కు నోట్లో నాలుకలాగా, ఆయనకు  అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్య కుడి భుజం అయితే.  కిరణ్ కుమార్ రెడ్డి ఎడమ భుజంలా వ్యవహరించారు. రాజకీయంగా నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డిలతో చాలా సన్నిహితంగా వుండేవాడు.

స్పీకర్‌గా 

2009 జూన్ లో 13వ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి ఆయన పేరును మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, AIMIM ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ , వ్యవసాయ మంత్రి ఎన్. రఘువీరా రెడ్డి, మరో ఇద్దరు స్వతంత్రులు ప్రతిపాదించారు.

ముఖ్యమంత్రిగా 

2011లో కొణిజేటి రోశయ్య వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి తన పాలనలో ప్రవేశపెట్టిన పధకాలు మీ సేవ , రాజీవ్ యువకిరణాలు , SC/ST సబ్‌ప్లాన్ , బంగారు తల్లి , విద్యా పక్షోత్సవాలు, మన బియ్యం , అమ్మ హస్తం,ఇందిర జలప్రభ,  చిత్తూరు నీటి పథకం వంటి పథకాలను ప్రారంభించారు. కానీ, తెలంగాణ ఉద్యమం ఆయన పదవికాలంలో తీవ్రస్థాయికి చేరుకుంది. కేంద్రం కూడా తెలంగాణ ఏర్పాటు సన్నాహాకాలు చేస్తుంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆయన 19 ఫిబ్రవరి 2014న ముఖ్యమంత్రి పదవికి, తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తెలంగాణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కి కూడా రాజీనామా చేశారు. ఇలా ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు.  
  
జై సమైక్యాంధ్ర పార్టీ 

ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తూ.. 11 మార్చి 2014న జై సమైక్యాంధ్రా అనే రాజకీయ పార్టీని ప్రారంభించారు.  అధికారికంగా 12 మార్చి 2014న రాజమండ్రిలో పార్టీని ప్రారంభించాడు. ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కకపోవడంతో పార్టీని  రద్దు చేసి, 13 జూలై 2018న INC లో తిరిగి చేరాడు.

భారతీయ జనతా పార్టీ 

2018లో కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజకీయాల్లో మాత్రం క్రియాశీలకంగా పనిచేయడం లేదు. గతేడాది ఏప్రిల్ 2023లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో న్యూఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో కాషాయం కండువా కప్పుకున్నారు. సుధీర్ఘ విరామం తరువాత రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ  తరుపున పోటీచేయనున్నారు.  

click me!