వైఎస్ షర్మిల ఎక్కడా తగ్గట్లేదుగా... వైఎస్ జగన్ పై ఎవర్ని బరిలో దింపిందో తెలుసా..?

By Arun Kumar PFirst Published Apr 22, 2024, 4:20 PM IST
Highlights

వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీచేసే పులివెందుల అసెంబ్లీతో సహా మరికొన్ని నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఆసక్తికర విషయం ఏంటంటే ఏకంగా పదిమంది అభ్యర్ధులను మార్చి కొత్తవారికి అవకాశం ఇచ్చారు. ఇలా అభ్యర్థులు మారిన నియోజకవర్గాలు ఏవంటే....

అమరావతి :ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ వెలువడి నోటిఫికేషన్ కూడా జారీ అయ్యింది. అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థుల ప్రకటించేసి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ పార్టీల అభ్యర్థుల్లో కొందరు ఇప్పటికే నామినేషన్లు కూడా వేసారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థుల ఎంపిక వద్దే ఆగిపోయింది. వైఎస్ షర్మిల రాష్ట్ర పగ్గాలు చేపట్టినప్పటి నుండి కాంగ్రెస్ లో కాస్త హుషారు కనిపించినా ఎన్నికలు దగ్గపడేకొద్ది అదికాస్త తగ్గింది. 

అసెంబ్లీతో పాటు లోక్ సభ అభ్యర్థుల ఎంపిక విషయంలో వైఎస్ షర్మిల కూడా అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కన్ఫ్యూజన్ కు గురవుతున్నట్లు కనిపిస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాక వారిని కాదని కొత్తవారికి అవకాశం ఇచ్చారు వైఎస్ జగన్. ఇలా మంగళగిరితో పాటు మరికొన్ని అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారు వైసిపి అధినేత. సేమ్ ఇలాగే కాంగ్రెస్ లో అభ్యర్థుల మార్పు జరిగింది. ముందుగా ప్రకటించిన 10 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారు వైఎస్ షర్మిల. ఆమె సూచించినవారికే ఆ సీట్లు దక్కాయి. 

తాజాగా మరో 38 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించారు.  ఈ మేరకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసారు. దీంతో ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితా 142కు చేరింది. మిగతా అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి వుంది. 

అభ్యర్థులను మార్చిన నియోజకవర్గాలు : 

శ్రీకాకుళం ‌ - మొదట పాడి నాగభూషణరావుకు కాంగ్రెస్ టికెట్ దక్కగా తాజాగా అంబటి కృష్ణారావును అక్కడ పోటీలో నిలిపింది కాంగ్రెస్. 

గజపతినగరం - కురిమినాయుడు తప్పించి డోలా శ్రీనివాస్ టికెట్ 

తాడికొండ (ఎస్సి) - చిలకా విజయ్ కుమార్ ను తప్పించి మణిచల సుశీల్ రాజాకు టికెట్

ఒంగోలు - బుట్టి రమేశ్ బాబును తప్పించి తుర్లపాక నాగలక్ష్మికి టికెట్ 

కోవూరు  ‌- మోహన్ ను  తప్పించి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి 

సర్వేపల్లి - పూల చంద్రశేఖర్ ను తప్పించి పి.వి.శ్రీకాంత్ రెడ్డి 

గూడూరు ‌- వేమయ్య స్థానంలో రామకృష్ణారావు పోటీకి 

సూళ్లూరుపేట - గడి తిలక్ బాబు స్థానంలో చందనమూడి శివ 

హిందూపురం - వి నాగరాజు స్థానంలో మహ్మద్ హుస్సేన్ ఇనయతుల్లా 

తాజాగా ప్రకటించిన కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా : 
 
నెల్లిమర్ల - ఎస్. రమేష్ కుమార్ 

బొబ్బిలి - మరిపి విద్యాసాగర్ 

విశాఖపట్నం ఉత్తరం - లక్కరాజు రామారావు 

చోడవరం - జగత్ శ్రీనివాస్ 

పి. గన్నవరం - కె. చిట్టిబాబు 

యలమంచిలి - నర్సింగరావు 

ఆచంట - నెక్కంటి వెంకట సత్యనారాయణ 

విజయవాడ (ఈస్ట్) - సుంకర పద్మశ్రీ 

జగ్గయ్యపేట - కర్నాటి అప్పారావు 

రేపల్లె - మోపిదేవి శ్రీనివాసరావు 

తెనాలి -ఎస్.కె. బషీద్ 

గుంటూరు వెస్ట్ - రాచకొండ జాన్ బాబు 

చీరాల - ఆమంచి కృష్ణమోహన్ 

కనిగిరి - దేవరపల్లి సుబ్బారెడ్డి 

కావలి - పొదలకూరి కల్యాణ్ 

వెంకటగిరి - పి. శ్రీనివాసులు 

కడప - తుమ్మన్ కల్యాల్ అస్జల్ అలీఖాన్ 

పులివెందుల ‌- మూలంరెడ్డి ధ్రువకుమార్ రెడ్డి 

జమ్మలమడుగు -  బ్రహ్మానందరెడ్డి 

ప్రొద్దుటూరు - షేక్ మహ్మద్ నజీర్ 

మైదుకూరు - గుండ్లకుంట శ్రీరాములు 

ఆళ్లగడ్డ - బారగొడ్ల హుస్సేన్ 

శ్రీశైలం - అసర్ సయ్యద్ ఇస్మాయిల్ 

బనగానపల్లె - గూటం పుల్లయ్య 

డోన్ - గారపాటి మధులెట్టి స్వామి 

ఆదోని - గొల్ల రమేష్ 

ఆలూరు - నవీన్ కిషొర్ ఆరకట్ట 

కల్యాణదుర్గం - రాంభూపాల్ రెడ్డి 

ధర్మవరం - రంగాన అశ్వర్థ నారాయణ 

click me!