ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హో దా విషయంలో ఏపీ సీఎం జగన్‌కు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. జగన్‌ను వ్యతిరేకించి బీజేపీతో చేతులు కలిపితే ప్రత్యేక హోదా తీసుకు రావాలని ఆయన కోరారు.
Also read:పవన్ కళ్యాణ్ పై కేఏపాల్ సంచలన కామెంట్స్
undefined
ట్విట్టర్‌లో కేఏ పాల్ ఓ వీడియోను పోస్టు చేశారు.ఈ వీడియోలో పవన్ కళ్యాణ్‌పై కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. మోడీతో అత్యంత దగ్గర సంబంధాలు ఉంటే ప్రత్యేక హోదాను ఎందుకు తీసుకురాలేకపోయావని పవన్ కళ్యాణ్‌ను కేఏ పాల్ ప్రశ్నించారు.
Also Read సచివాలయం శాశ్వతమని బాబు నిరూపిస్తే తలదించుకొని వెళ్తా: బొత్స సవాల్...
ప్రజలు నిన్ను నమ్మలేదన్నారు. అందుకే నీ పార్టీని నిన్ను ఓడించారని పవన్ కళ్యాణ్‌పై కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. వైఎస్ఆర్ కొడుకు జగన్ ఏపీ సీఎం. ఆయనపై నిందలు వేస్తారా అని పవన్ కళ్యాణ్‌ను కేఏ పాల్ ప్రశ్నించారు. తాను ఎన్నికలకు మూడు మాసాల ముందే వచ్చినట్టుగా చెప్పుకొన్నారు.
Also read: మాకు బీజేపీ గేట్లు మూసివేశారా: బీజేపీ, జనసేన పొత్తుపై టీడీపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు
2008 నుండి రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఏం చేశాడని పాల్ అడిగారు. 2009 ఎన్నికల్లో ప్రజా రాజ్యం పార్టీకి 18 శాతం ఓట్లు, కాంగ్రెస్ కు 40 శాతం ఓట్లు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీలకు సుమారు 58 శాతం ఓట్లు వస్తే, ఈ ఎన్నికల్లో మాత్రం కనీసం రెండు శాతం ఓట్లు కూడ రాలేదన్నారు.
Also read:టీడీపీ, వైసీపీలను అడగండి: ప్రత్యేక హోదాపై పవన్
2019 ఎన్నికల్లో బీజేపీ, జనసేన, వామపక్ష పార్టీలకు ఐదు శాతం వచ్చిన విషయాన్ని కేఏ పాల్ గుర్తు చేశారు. బీజేపీకి ఒక్కశాతం, మీ పార్టీలకు 4 శాతం ఓట్లు వచ్చినట్టుగా చెప్పారు. ప్రస్తుతం కమ్యూనిష్టులకు పవన్ కళ్యాణ్ హ్యాండిచ్చారని పాల్ సెటైర్లు వేశారు.
Also read:అమరావతి నుండి రాజధాని తరలింపు సాధ్యం కాదు: తేల్చేసిన కన్నా
also read:: ఏపీలో బీజేపీ, జనసేన పొత్తు: సీఏఏకు జై కొట్టిన పవన్
Also read:భేషరతుగానే జనసేన మాతో చేతులు కలిపింది, అధికారమే టార్గెట్: కన్నా
also read:అతనో చెంగువీరా...: పవన్‌పై సీపీఐ రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు
డ్యాన్సులు వేస్తే పెట్టుబడులు వస్తాయా అంటూ పవన్ కళ్యాణ్‌ను పాల్ ప్రశ్నించారు. అంతేకాదు పవన్ నిజ స్వరూపం ఇప్పుడే బయటపడిందని పాల్ వ్యాఖ్యానించారు.