సచివాలయం శాశ్వతమని బాబు నిరూపిస్తే తలదించుకొని వెళ్తా: బొత్స సవాల్

By narsimha lodeFirst Published Jan 17, 2020, 1:41 PM IST
Highlights

ఆమరావతిలో భవనాల నిర్మాణంపై చంద్రబాబుకు మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం నాడు సవాల్ విసిరారు.

అమరావతి: సచివాలయం శాశ్వతమని చంద్రబాబు చెప్పినట్టు నిరూపిస్తే తాను తలదించుకొని వెళ్తానని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. 

Also read:మహిళలను మగపోలీసులు కొట్టారా?: ఏజీపై ఏపీ హైకోర్టు ప్రశ్నల వర్షం

హై పవర్ కమిటీ  సమావేశం తర్వాత ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారంనాడు  మీడియాతో మాట్లాడారు.అన్ని వర్గాలు బాగుపడాలనేదే తమ తపన అని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. అమరావతి ప్రాంత అభివృద్ధి తమ బాధ్యత అన్నారు. అమరావతి రైతులు చంద్రబాబు ఉచ్చులో పడొద్దని బొత్స సత్యనారాయణ హితవు పలికారు.

Also read: జగన్‌తో హైపవర్ కమిటీ భేటీ: తేలనున్న అమరావతి భవితవ్యం

హై పవర్  కమిటీ  సమావేశం వివరాలను  సీఎం జగన్‌ దృష్టికి తీసుకొచ్చినట్టుగా చెప్పారు. సీఆర్‌డీఏ రద్దు గురించి తనకు తెలియదని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.

also read:అమరావతి: విశాఖకు రాజధాని తరలించొద్దంటూ సీఆర్‌డీఏకు రైతుల అభ్యంతరాలు

Also Read:జగన్ వెన్నుపోటు పొడిచాడు:అమరావతి రైతుల దీక్షలో వంగవీటి రాధా

13 జిల్లాల అభివృద్ధి ప్రభుత్వానిదేనని బొత్స సత్యనారాయణ చెప్పారు. ఉనికిని కాపాడుకొనేందుకు విపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయని బొత్స సత్యనారాయణ తెలిపారు. అవసరమైతే మరోసారి హై పవర్ కమిటీ సమావేశం అవుతోందన్నారు.

లేకపోతే హైపవర్ కమిటీ రిపోర్టును ప్రభుత్వానికి అందించనున్నట్టుగా మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.అమరావతిలో ఉన్న భవనాలను ప్రత్యామ్నాయ అవసరాలకు ఉపయోగిస్తామన్నారు. 
 

click me!