కోడి కత్తి, వివేకా హత్య కేసులపై... పవన్ ఆసక్తికర కామెంట్స్

By telugu teamFirst Published Sep 14, 2019, 1:26 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కోడికత్తి, వివేకా హత్య కేసులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని వ్యాఖ్యానించారు. కోడికత్తి కేసుపై గతంలో సీబీఐ విచారణకు ఆదేశించాలని ఈ సందర్భంగా పవన్ డిమాండ్ చేశారు. కోడికత్తి, వివేకా హత్య హత్యకేసులు ఇంతవరకు తేల్చలేదని అసహనం వ్యక్తం చేశారు.

వైఎస్ జగన్ 100 రోజుల పాలనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివేదిక విడుదల చేశారు. 9 అంశాలతో 33 పేజీలతో నివేదిక రూపొందించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పవన్ మాట్లాడారు. పలు విషయాలపై మాట్లాడిన పవన్.. పోలీసు వ్యవస్థ పనితీరును కూడా ప్రశ్నించారు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కోడికత్తి, వివేకా హత్య కేసులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని వ్యాఖ్యానించారు. కోడికత్తి కేసుపై గతంలో సీబీఐ విచారణకు ఆదేశించాలని ఈ సందర్భంగా పవన్ డిమాండ్ చేశారు. కోడికత్తి, వివేకా హత్య హత్యకేసులు ఇంతవరకు తేల్చలేదని అసహనం వ్యక్తం చేశారు.

 ఈ రెండు ఉదంతాలపై పోలీసుశాఖ దృష్టిసారించాలని చెప్పారు.  లేదంటే సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరతామన్నారు.  3 నెలల్లో వైసీపీ చేసింది ఒకే పని ప్రజావేదికను కూల్చడమన్నారు.  వైసీపీకి ఇచ్చిన 100రోజుల గడువు ముగిసిందని చెప్పారు.  ఇక క్షేత్రస్థాయి, రాజకీయ పోరాటాలు చేస్తామని  పవన్ తెలిపారు. తమ నివేదికపై స్పష్టమైన వివరణ ఇవ్వకపోతే పోరు తప్పదంటూ జగన్ ప్రభుత్వానికి పవన్ హెచ్చరికలు జారీ చేశారు. 

బ్రాందీని బొర్న్‌ వీటాలా ప్రమోట్ చేస్తారేమో: జగన్ ప్రభుత్వంపై పవన్ వ్యాఖ్యలు

కోడి కత్తి, వివేకా హత్య కేసులపై... పవన్ ఆసక్తికర కామెంట్స్

గ్రామాల నాశనానికే... గ్రామవాలంటీర్ల వ్యవస్థ: పవన్

రాష్ట్ర ప్రభుత్వమంటే... సిమెంట్ ఫ్యాక్టరీ కాదు: జగన్‌పై పవన్ విసుర్లు

పథకాలు జనరంజకం.. కానీ పాలన జనవిరుద్ధం: జగన్‌పై పవన్ సెటైర్లు

జగన్ పాలనపై 6 నెలల వరకు స్పందించదలచుకోలేదు.. కానీ: పవన్

click me!