గ్రామవాలంటీర్ల వ్యవస్థ ద్వారా వైసీపీ క్యాడర్‌ను వచ్చే ఎన్నికల కోసం సిద్ధం చేస్తున్నారని పవన్ ఆరోపించారు. ఇది కొరియర్ సర్వీస్‌లా ఉందని జనసేనాని సెటైర్లు వేశారు. తెలుగుదేశం పార్టీని జన్మభూమి కమిటీలు ఎంతగా దెబ్బతీశాయో.. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా వైసీపీ అదేగతి పడుతుందన్నారు.
గ్రామవాలంటీర్ల వ్యవస్థ ద్వారా వైసీపీ క్యాడర్‌ను వచ్చే ఎన్నికల కోసం సిద్ధం చేస్తున్నారని పవన్ ఆరోపించారు. ఇది కొరియర్ సర్వీస్‌లా ఉందని జనసేనాని సెటైర్లు వేశారు. తెలుగుదేశం పార్టీని జన్మభూమి కమిటీలు ఎంతగా దెబ్బతీశాయో.. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా వైసీపీ అదేగతి పడుతుందన్నారు.
ప్రధాని నరేంద్రమోడీ దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా మార్చాలని ప్రయత్నిస్తున్నారని.. కానీ జగన్ మాత్రం ఉన్న పెట్టుబడులను పంపించేస్తున్నారని ఎద్దేశా చేశారు.
undefined
వైసీపీ ప్రభుత్వానికి దార్శనికత లేదని.. కిడ్నీ బాధితులకు రూ. 15 వేల పెన్షన్ ఇస్తానన్నారని అది ఎక్కడి వరకు వచ్చిందో తెలియదన్నారు. ప్రజారోగ్య విధానం అద్వాన్నంగా తయారైందని పవన్ విమర్శించారు.
పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వరమని.. దాదాపు 20 లక్షల ఎకరాలకు సాగునీరు, విశాఖ పారిశ్రామిక అవసరాలు, విద్యుత్ వంటి ఎన్నో ప్రయోజనాలున్నాయని.. ఇంతటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం నిలిపివేసిందన్నారు.
నిర్మాణంలో అవకతవకలు జరిగినట్లయితే.. దానిపై విచారణ జరిపించాలని పవన్ సూచించారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి రూ. 300 కోట్ల నష్టాన్ని భరించమని చెప్పారని.. మరి వైసీపీ నేతలు భరిస్తారా, బొత్స విజయనగరంలో ఆస్తులమ్మి భరిస్తారా అంటూ పవన్ దుయ్యబట్టారు.
కృష్ణానదికి వరద పోటెత్తనుందని కేంద్ర జలవనరుల శాఖ జూలై నెలలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిందని.. దీనికి వైసీపీ ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఆ సమయంలో జగన్ అమెరికా పర్యటనలో ఉన్నారని.. మంత్రులు ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారంటూ పవన్ చురకలంటించారు.
మంత్రులు వేగంగా స్పందించి వుంటే రాయలసీమలో చెరువులు, కుంటలు, పంటకాలువలు నీళ్లతో కళకళలాడేవని.. కానీ చివరికి సముద్రం పాలుచేశారని జనసేనాని ఎద్దేవా చేశారు. వరదల సమయంలో కృష్ణలంక మునిగిపోతుంటే.. మాజీ ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ వైసీపీ నేతలు చక్కర్లు కొట్టారని మండిపడ్డారు.
బ్రాందీని బొర్న్ వీటాలా ప్రమోట్ చేస్తారేమో: జగన్ ప్రభుత్వంపై పవన్ వ్యాఖ్యలు
కోడి కత్తి, వివేకా హత్య కేసులపై... పవన్ ఆసక్తికర కామెంట్స్
గ్రామాల నాశనానికే... గ్రామవాలంటీర్ల వ్యవస్థ: పవన్
రాష్ట్ర ప్రభుత్వమంటే... సిమెంట్ ఫ్యాక్టరీ కాదు: జగన్‌పై పవన్ విసుర్లు
పథకాలు జనరంజకం.. కానీ పాలన జనవిరుద్ధం: జగన్‌పై పవన్ సెటైర్లు
జగన్ పాలనపై 6 నెలల వరకు స్పందించదలచుకోలేదు.. కానీ: పవన్