శ్రీకాకుళం జిల్లాలో దారుణం:అనుమానంతో భార్యను తుపాకీతో చంపిన భర్త

Published : Oct 17, 2021, 12:29 PM IST
శ్రీకాకుళం జిల్లాలో దారుణం:అనుమానంతో భార్యను తుపాకీతో చంపిన భర్త

సారాంశం

అనుమానంతో శ్రీకాకుళం జిల్లాలో భర్త తన భార్యను తుపాకీతో కాల్చి చంపాడు.జగ్గారావు అనే వ్యక్తి తన భార్యపై అనుమానం పెంచుకొన్నాడు. భార్య పద్మను తుపాకీతో కాల్చి చంపాడు.ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అడవి జంతువుల రక్షణ కోసం తీసుకొన్న తుపాకులు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి.


శ్రీకాకుళం: అనుమానంతో భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు భర్త. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకొంది. Srikakulam  జిల్లా మెళియాపుట్టి మండలంలోని Bharanikota అనే గిరిజన తండాలో అనుమానంతో Jagga Rao అనే వ్యక్తి  తన భార్యను నాటు తుపాకీతో కాల్చి చంపాడు.

భరణికోట కాలనీకి చెందిన జగ్గారావు... Padmaను కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకొన్నాడు.  వీరికి ఇద్దరు కుమారులున్నారు. భార్యపై అనుమానంతో జగ్గారావు గత కొన్నాళ్లుగా భార్యతో తరచూ గొడవపడుతుండేవాడు. మద్యం తాగొచ్చి రోజూ వేధింపులకు పాల్పడతుండేవాడు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం కూడా ఇద్దరి మధ్య వివాదం జరిగింది. అప్పటికే మత్తులో ఉన్న జగ్గారావు తన వద్దనున్న నాటు తుపాకితో పద్మను కాల్చాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందింది.

also read:ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. కానీ, రెండు నెలలు తిరుగకముందే నవ వధువు ఆత్మహత్య

ఈ విషయమై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.  పద్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మెళియాపుట్టి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

ఇదిలాఉంటే.. ఇటీవల అదే గ్రామంలో నాటు తుపాకీతో ఓ వ్యక్తి తన సోదరుడిని చంపాడు. ఈ ఘటన మరువక ముందే మళ్లీ ఇలాంటిదే చోటు చేసుకోవడంతో గ్రామంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జంతువుల నుంచి రక్షణ కోసమని ఈ ప్రాంత గిరిజనులు నాటు తుపాకులను తమ వద్ద ఉంచుకుంటున్నారు. అవే వారి ప్రాణాలు తీస్తున్నాయంటూ పలువురు పేర్కొంటున్నారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : శ్రీలంక సమీపంలో ఆవర్తనం... ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు
Minister Narayana: అమరావతికి కొత్త దారి.. పరిశీలించిన మంత్రి నారాయణ | Asianet News Telugu