ఫేస్‌బుక్‌లో యువతికి పరిచయం: రూ. 9 లక్షలతో పరారీ

By narsimha lodeFirst Published Oct 17, 2021, 9:41 AM IST
Highlights

ఫేస్‌బుక్ లో పరిచయమై ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించిన అనంతపురానికి చెందిన నిందితుతు దీపాబాబుపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత యువతి నుండి నిందితుడు రూ.9.33 లక్షలు, 192 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నారు.
 

తిరుపతి: ఫేస్‌బుక్ లో పరిచయమైన స్నేహితుడు  Tirupatiకి చెందిన యువతిని మోసం చేశారు. బాధితురాలి నుండి  రూ. 9 లక్షల నగదు, బంగారు ఆభరణాలను తీసుకొన్నాడు. Job ఇప్పిస్తానని చెప్పి ఆ యువతిని మోసం చేశాడు.ఈ విసయమై  బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

also read:కేవైసీ అప్‌డేట్‌తో డబ్బుల స్వాహా: 10 మంది ముఠాను అరెస్ట్

తిరుపతి పట్టణానికి చెందిన TTD ఇంజనీర్ Devendra kumar కూతురు అనంతపురానికి చెందిన deepababu తో ఫేస్‌బుక్ లో పరిచయం ఏర్పడింది. దీపాబాబు నిత్యం ఆమెతో ఛాటి్ంగ్ చేసేవాడు.త అనంతపురం కోర్టులో ఉద్యోగం  ఇప్పిస్తానని ఆమెను నమ్మించాడు. ఈ విషయమై కొంత డబ్బు అవసరమని చెప్పాడు. దీంతో ఆ యువతి అతడు చెప్పిన మాటలను నమ్మింది.
నిందితుడు దీపాబాబు బాధితురాలి నుండి  రూ.9.33 లక్షలను 192 గ్రాముల బంగారు ఆభరణాలను కూడ  తీసుకొన్నాడు. 

ఈ డబ్బులు తీసుకొన్న తర్వాత నిందితుడు ఉద్యోగం గురించి ప్రశ్నించినా కూడ అతని నుండి స్పందన లేదు. మరో వైపు ఫేస్‌బుక్ లో ఛాటింగ్ కూడా మానేశాడు.ఈ విషయమై బాధితురాలు తాను మోసపోయానని గుర్తించింది. వెంటనే తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాధితురాలు కుటుంబసభ్యులు అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.సైబర్ నేరాల గురించి ప్రజలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.అపరిచితులతో ఛాలింగ్ చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే నిందితులు చెప్పే మాటలను నమ్మి బాధితులు  మోసపోతున్నారు.

కరోనా  సమయం నుండి దేశంలోని పలు రాష్ట్రాల్లో  సైబర్ నేరాలు పెరుగుతున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. భరత్ పూర్ గ్యాంగ్ దేశంలోని పలు రాష్ట్రాల్లో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడ ఈ గ్యాంగ్ పై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ గ్యాంగ్ కు చెందిన  కొందరు నిందితులను రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు అరెస్ట్ చేశారు.

click me!