అధికారాన్ని కట్టబెట్టిన వారిపైనే దాడులు... వైసీపీ కి కాలం చెల్లే రోజులు: అచ్చెన్నాయుడు

By Arun Kumar PFirst Published Oct 17, 2021, 12:02 PM IST
Highlights

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం మద్దలకట్టలో దళితులపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దాడిచేయడం దుర్మార్గమన్నారు ఏపీ టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు.

గుంటూరు: అణగారిన దళిత సమాజాన్ని మరింతగా అణచివేయడమే వైసీపీ నైజంగా కనిపిస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం మద్దలకట్టలో దళితులపై వైసీపీ నాయకుల దాడి దుర్మార్గమన్నారు. దళితులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూకలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు kinjarapu atchannaidu. 

''సామూహిక అత్యాచారాలు, శిరోముండనాలు, హత్యాయత్నాలు, అక్రమ కేసులు, అక్రమ నిర్భంధాలు, గృహనిర్భంధాలు, కక్ష సాధింపులతో రాష్ట్రంలో వైసిపి పాలన జర్మనీలోని నాజీల దురాగతాలను కళ్ళకు కడుతుంది. జగన్ పాలనపై ఎస్సీలు వ్యతిరేకంగా ఉన్నారనే దాడులు చేసి బెదిరిస్తున్నారు. పరిషత్ ఎన్నికల్లో  వైసీపీ నేతలు ఓడిపోతే దానికి దళితులు కారణం అవుతారా? వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులపై చేసిన దాడులకు, హత్యలకు, అత్యాచారాలకు అడ్డులేకుండా పోయింది'' అని AP TDP అధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేసారు. 

''అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో దళితులపై వైసీపీ చేసిన దాడులు మునుపెన్నడూ లేవు. రాష్ట్రంలో 158 దళిత కుటుంబాలపై దాడులకు, హత్యాయత్నాలకు వైసీపీ శ్రేణులు తెగబడ్డారు. అధికారాన్ని కట్టబెట్టిన దళితులపైనే jaganmohan reddy పార్టీ దుర్మార్గాలకు పాల్పడుతోంది'' అన్నారు. 

read more  జగన్‌కు ఝులక్.. కేంద్ర మంత్రితో నేను మాట్లాడతా, మండలి రద్దుపై మళ్లీ కెలికిన రఘురామ

''సొంత నియోజకవర్గంలో ఎస్సీలపై దాడులు చేస్తుంటే విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ ఏం చేస్తున్నారు? వైసీపీలోని ఓ వర్గానికి adimulapu suresh భయపడుతున్నారు. భయపడకపోతే దాడి చేసిన ysrcp నేతలను వెంటనే సస్పెండ్ చేయాలి'' అని అచ్చెన్న డిమాండ్ చేసారు. 

''విష సర్పాల్లాగా వైసీపీ నేతలు దళితులపై దాడులు చేస్తున్నారు. మంత్రి నియోజకవర్గంలోనే రాజుపాలెంలో దళిత యువతిపై అత్యాచారం చేసిన కరుణాకర్ రెడ్డిపై ఇప్పటికీ చర్యలు లేవు. ఇప్పుడు మద్దలకట్టలో దాడులు చేశారు. ఈ ఘటనలపై మంత్రి ఎందుకు మౌనం వహిస్తున్నారో దళితులకు సమాధానం చెప్పాలి'' అన్నారు. 

''దళిత వంచక ప్రభుత్వంగా వైసీపీ రూపాంతరం చెందింది. దళితుల ప్రాణాలను తీస్తున్నారు. దళితులపైనే అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. వారి భూములకు రక్షణ లేదు. ఉపాధికి దిక్కులేదు. దళితులను అన్నింటా ముంచిన వైసీపీకి బుద్ధి చెప్పాలి. ఎస్సీలపై దాడులు జరుగుతన్నా పదవుల కోసం పెదవి విప్పకపోవడం దళితుల్ని వంచన చేయడమే. తక్షణమే దాడి చేసిన వైసీపీ నేతలను శిక్షించాలి'' అని అచ్చెన్న డిమాండ్ చేసారు.

 
 

click me!